క్రీడలతో శారీరక, మానసిక ఆరోగ్యం | - | Sakshi
Sakshi News home page

క్రీడలతో శారీరక, మానసిక ఆరోగ్యం

Apr 6 2025 12:53 AM | Updated on Apr 6 2025 12:53 AM

క్రీడలతో శారీరక, మానసిక ఆరోగ్యం

క్రీడలతో శారీరక, మానసిక ఆరోగ్యం

బళ్లారిఅర్బన్‌: నిత్య జీవితంలో ప్రతి ఒక్కరూ శారీరకంగా, మానసిక ఆరోగ్యానికి క్రీడలు ఉపయోగపడతాయని, ప్రతి రోజు క్రీడలకు, వ్యాయామానికి కొంత సమయం కేటాయించాలని మేయర్‌ ముల్లంగి నందీష్‌ సూచించారు. వివిధ శాఖల ఆధ్వర్యంలో జిల్లా స్టేడియంలో శనివారం ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల క్రీడా పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. ప్రస్తుతం అందరూ మొబైల్‌ ఫోన్‌కు బానిసలుగా మారి శారీరక, మానసిక ఆరోగ్య పరిరక్షణలో సోమరితనంతో వెనుకబడి పోయారన్నారు. అందుకే ప్రతి ఒక్కరూ తప్పకుండా తీరిక చేసుకొని నిర్ణీత సమయంలో వ్యాయామం, క్రీడల్లో పాల్గొనాలన్నారు. జెడ్పీ సీఈఓ మహమ్మద్‌ హ్యారిస్‌ సుమైరా, అదనపు జిల్లాధికారి మహమ్మద్‌ జుబేర్‌, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా శాఖ కార్యదర్శి జీవై తిప్పారెడ్డి, ఉద్యోగులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. ముందుగా క్రీడా ధ్వజంతో ఆకర్షణీయమైన పరేడ్‌ను నిర్వహించారు. మాజీ ఉప ప్రధాని డాక్టర్‌ బాబూ జగ్జీవన్‌ రామ్‌ 118వ జయంతి వేడుకలను ఆచరించారు. ఎకై ్సజ్‌ డిప్యూటీ కమిషనర్‌ మంజునాథ్‌, డీహెచ్‌ఓ డాక్టర్‌ యల్లా రమేష్‌బాబు, సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు, జిల్లా అధ్యక్షుడు ఎంఏ అసీఫ్‌, యువజన సేవా క్రీడా శాఖ అధికారి కే.గ్రేసీ, వివిధ తాలూకాల అధ్యక్షులు, పదాధికారులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement