బస్సు పల్టీ.. 50 మందికి గాయాలు
తుమకూరు: కేఎస్ ఆర్టీసీ బస్సు అదుపు తప్పి పల్టీ కొట్టడంతో 50 మంది ప్రయాణికులు గాయపడ్డారు. ఈఘటన తుమకురు జిల్లా పావగడ సమీపంలోని శివరామ గ్రామంలో జరిగింది. శుక్రవారం వేకువజామున 4.30 గంటల సమయంలో 63 మంది ప్రయాణికులతో పావగడ నుంచి బెంగళూరు బయల్దేరిన బస్సు శివరామ గ్రామం వద్దకు రాగానే అతి వేగం వల్ల అదపు తప్పి పల్టీలు కొట్టింది. దీంతో ప్రయాణికులు బస్సు బయటకు చెల్లా చెదురుగా విసిరివేయబడ్డారు. భయాందోళనకు గురైన ప్రయాణికులు ఆర్తనాదాలు చేశారు. అయితే 50 మందికి స్వల్పగాయాలు కాగా పావగడ, మడకశిర ఆస్పత్రులకు తరలించారు.
సీఎం ఇంటి ముందు బైక్ వీలింగ్
కృష్ణరాజపురం: ముఖ్యమంత్రి సిద్దరామయ్య నివాసం ముందు ఓ వ్యక్తి బైక్ వీలింగ్ చేస్తుండగా హైగ్రౌండ్ పోలీసులు అరెస్ట్ చేశారు. గత నెల 28వ తేదీ రాత్రి సదరు బైకిస్టు ముఖ్యమంత్రి నివాసం ముందు నుంచి బీడీఏ రోడ్డు వరకు వీలింగ్ చేసుకుంటూ వెళ్లాడు. బైకు నంబర్ ఆధారంగా ఆ వ్యక్తిని గుర్తించి అరెస్ట్ చేసి వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.
ఉసురు తీసిన అనారోగ్యం
● ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్య
తుమకూరు: అనారోగ్య సమస్యలు చుట్టుముట్టడంతో ఓ తల్లి తన ఇద్దరు పిల్లలతో కలిసి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద ఘటన తుమకూరు జిల్లా గుబ్బి తాలూకాలోని నిట్టూరు సమీపంలోని ఆదళగెరె గ్రామంలో జరిగింది. చేళూరు పోలీసు స్టేషన్ పరిధిలోని ఆదళగెరె గ్రామంలో మహాదేవయ్య, విజయలక్ష్మి(45) దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి చూడామణి(23), నరసింహమూర్తి(14) అనే సంతానం ఉంది. విజయలక్ష్మి అనారోగ్యంతో ఇబ్బందులు పడుతోంది. తాను అనారోగ్యంతో మృతి చెందితే తన ఇద్దరు పిల్లలలను ఎవరు పెంచుతారని ఇటీవల బాధపడింది. ఈక్రమంలో భర్త ఇంటిలో లేని సమయంలో గురువారం రాత్రి సుమారు 7 గంటల సమయంలో తల్లీపిల్లలు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. చేళూరు పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.
ఖరీదైన ఫోన్.. ప్రాణం తీసింది
దొడ్డబళ్లాపురం: ఖరీదైన ఫోన్ ఎందుకు కొన్నావని తండ్రి మందలించడంతో మనస్తాపంతో కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన బెళగావి పట్టణంలో జరిగింది. న్యూ వైభవ్ నగర్ నివాసి అబ్దుల్ రషీద్ షేక్(24) ఈఎంఐ పెట్టి రూ.70వేలు విలువ చేసే స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేశాడు. అంత ధర పెట్టి సెల్‌ఫోన్ ఎందుకు కొనాల్సి వచ్చిందని తండ్రి ప్రశ్నించాడు. మనో వేదనకు గురైన రషీద్ తన ఇంటిలోనే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. శుక్రవారం ఉదయం ఎంతసేపైనా తలుపులు తీయకపోవడంతో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు తలుపులు బద్దలుకొట్టి చూడగా ఉరివేసుకున్న విషయం తెలిసింది. ఏపీఎంసీ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
వాహ్..హంపీ అద్భుతం
● చరిత్రాత్మక సుగ్రీవ గుహల్లో గవర్నర్, మంత్రుల సందర్శన
హొసపేటె: గవర్నర్ ఽథావర్‌చంద్ గెహ్లాట్ శుక్రవారం హంపీలోని చరిత్రాత్మక సుగ్రీవ గుహలను సందర్శించారు. గవర్నర్ వెంట ఉన్నత విద్యా మంత్రి డాక్టర్ ఎంసీ సుధాకర్, విజయనగర జిల్లాధికారి దివాకర్, జిల్లా ఎస్పీ శ్రీహరిబాబు పాల్గొన్నారు. సందర్శన సమయంలో రామాయణంలో ప్రముఖ స్థానాన్ని కలిగిన, కర్ణాటక విలువైన వారసత్వానికి ఒక మైలురాయిగా ఉన్న ఈ ప్రాంత సాంస్కృతిక, చారిత్రక ప్రాముఖ్యత గురించి తెలుసుకున్నారు.
బస్సు పల్టీ.. 50 మందికి గాయాలు
బస్సు పల్టీ.. 50 మందికి గాయాలు


