యశవంతపుర: తనపై అక్రమంగా కేసు నమోదు చేశారని ఆరోపిస్తూ కొడగు జిల్లా సోమవారపేటె తాలూకా గోణిమరూరుకు చెందిన బీజేపీ కార్యకర్త వినయ్ సోమయ్య(35) డెత్‌నోటు రాసి బెంగళూరు నాగావరలోని పార్టీ కార్యాలయంలో ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాలు.. ఇతను ఇటీవల కాంగ్రెస్ ఎమ్మెల్యేపై ఒక పోస్టింగ్ అప్‌లోడ్ చేశాడు. అది అపహస్యంగా ఉందంటూ కాంగ్రెస్ నాయకుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మడికేరి పోలీసులు వినయ్ సోమయ్యపై కేసు నమోదు చేశారు. దీంతో అరెస్ట్ కాకుండా వినయ్ సోమయ్య ముందుస్తు బెయిల్ తీసుకున్నారు. అయితే గురువారం రాత్రి వినయ్ సోమయ్య డెత్‌నోటును సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసి శుక్రవారం వేకువజామున ఆత్మహత్య చేసుకున్నాడు. ఇతను మ్యాన్ పవర్ సప్లే సంస్థలో అతను పని చేస్తున్నట్లు తెలిసింది. భార్య, పిల్లలున్నారు. తన మృతికి విరాజపేట ఎమ్మెల్యే పొన్నణ్ణ, అతడి అప్తుడు తన్నీరా మహినా కారణమని వినయ్ డెత్‌నోటులో వివరించారు. రాజకీయ ద్వేషంతో తన జీవితంతో చెలగాటమాడారని, బెంగళూరులో ఉద్వోగం చేస్తున్న తనపై మడికేరిలో రౌడీషీట్ తెరవాలని ప్రయత్నాలు చేశారంటూ పేర్కొన్నాడు. వినయ్ సోమయ్య మృతిపై డీసీపీతో విచారణ చేయిస్తామని హోంమంత్రి డాక్టర్ పరమేశ్వర్ తెలిపారు. తప్పు చేసిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
నాకు సంబంధం లేదు
వినయ్ సోమయ్య ఎవరో తనకు తెలియదని సీఎం న్యాయ సలహాదారుడు, ఎమ్మెల్యే ఏఎస్ పొన్నణ్ణ స్పష్టం చేశారు. తాను ఏవరినీ వేధించలేదన్నారు. బీజేపీ నాయకులకు చేయటానికి పనిలేక నాపై అరోపిణలు చేస్తున్నట్లు అరోపించారు. కాగా వినయ్ ఏవరో తెలియదని, సామాజీక మాధ్యమాలలో ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా చేసిన పోస్ట్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశానని ఎమ్మెల్యే అప్తుడు తన్నీరా మహినా తెలిపారు.
ఎమ్మెల్యేపై ఫిర్యాదు
బీజేపీ కార్యకర్త వినయ్ డెత్‌నోటులో పేర్కొన్న కొడగు కాంగ్రెస్ ఎమ్మెల్యే పొన్నణ్ణ, మంథర్‌గౌడతో పాటు రాజీవ్‌గాంధీ పంచాయతీరాజ్ సంఘటన జిల్లా అధ్యక్షుడు తన్నీరా మహినాపై బెంగళూరు హెణ్ణూరు పోలీసులకు మృతుడు వినయ్ సోదరుడు జీవన్ సోమయ్య ఫిర్యాదు చేశారు.
నాగావరలో ఘటన
మృతుడు సోమవారపేటె తాలూకా
గోణిమరూరు వాసి
విరాజపేట ఎమ్మెల్యే పొన్నణ్ణ, అతని అప్తుడు తన్నీరా కారణమని డెత్‌నోట్
కొడుగుకు మృతదేహం తరలింపు
మృతుడు వినయ్ సోమయ్య మృతదేహానికి శుక్రవారం బెంగళూరులో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబసభ్యులకు అప్పగించారు. సోమవారపేటె తాలూకా గోణిమరూరులో శనివారం వినయ్ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. వినయ్ అత్మహత్యను ఖండిస్తూ కొడగు జిల్లా వ్యాప్తంగా బీజేపీ అందోళననలు చేపట్టింది.


