పోలీస్ స్టేషన్‌లో లాకప్ డెత్.. బాధ్యులపై చర్యలు చేపట
రాయచూరు రూరల్ : నగరంలోని వెస్ట్ పోలీస్ స్టేషన్‌లో లాకప్ డెత్ జరిగినట్లు సమాచారం అందింది. మూడు రోజుల క్రితం ఆశాపూర్ రోడ్డులో నివాసం ఉంటున్న వీరేష్(28) అనే వ్యక్తి తన భార్యతో గొడవ పడ్డాడు. ఈ విషయంలో వెస్ట్ పోలీస్ స్టేషన్‌లో భార్య తరపున కుటుంబ పెద్దలు ఫిర్యాదు చేశారు. వెస్ట్ పోలీస్ స్టేషన్ పోలీసులు కేసును సదర్ బజార్ మహిళా పోలీస్ స్టేషన్‌కు బదలాయించారు. రాజీ ప్రక్రియతో ఇరువురిని కలిపారు. కాగా మంగళవారం వెస్ట్ పోలీస్ స్టేషన్‌కు పోలీసులు పిలిచి ఇష్టానుసారంగా చితకబాదారని వీరేష్ తండ్రి గోపి వారి బంధువు నారాయణ ఆరోపించారు. పోలీసులు కొట్టిన దెబ్బలకు స్పృహ తప్పి ప్రాణాలు వదిలాడు. ఘటనపై కేసు నమోదుకు పోలీసులు నిరాకరించడంతో వీరేష్ కుటుంబ సభ్యులు ఎస్పీ కార్యాలయం వద్ద ఆందోళనకు పూనుకున్నారు. కాగా వెస్ట్ పోలీస్ స్టేషన్ అధికారులపై చర్యలు చేపట్టాలని శాసన సభ్యుడు శివరాజ్ పాటిల్ డిమాండ్ చేశారు. మంగళవారం రాత్రి ఎస్పీ కార్యాలయం వద్ద ఆందోళనకు పూనుకొని మాట్లాడారు. అతని మరణానికి బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని ధర్నా చేపట్టారు. కౌన్సిలర్లు నాగరాజ్, శఽశిరాజ్, నగర అధ్యక్షుడు రాఘవేంద్ర, బీజేపీ నేతలు ఆంజనేయ, రవీంద్ర జాలదార్, విజయ్ కుమార్ నాగరాజ్, యల్లప్ప, శ్రీనివాసరెడ్డిలున్నారు.
పోలీస్ స్టేషన్‌లో లాకప్ డెత్.. బాధ్యులపై చర్యలు చేపట


