1 నుంచి ఉపాధి పథకం కూలీ పెంపు
బళ్లారిటౌన్: ఉపాధి హామీ పథకం కూలీలకు ఏప్రిల్ 1నుంచి కూలీ మొత్తం పెరగనుంది. రోజుకు రూ.370కు పెంచి ఎండకాలంలో నిరంతరం 100 రోజులు పని కల్పిస్తున్నట్లు జిల్లా పంచాయతీ సీఈఓ మహమ్మద్ హ్యరీష్ సుమైర తెలిపారు. ఈ మేరకు శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. రూ.349 ఉన్న కూలీని సవరించి రూ.370కు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందన్నారు. కార్మికులు నమూన 6లో దరఖాస్తులను గ్రామ పంచాయతీలో సమర్పించి 100 రోజులు ఈ పనినిలో పాల్గొనవచ్చునన్నారు. మరిన్ని వివరాలకు ఆయా గ్రామ పంచాయతీలో తెలుసుకొవచ్చునని పేర్కొన్నారు.


