యత్నాళ్‌ బహిష్కరణపై పునరాలోచించాలి | - | Sakshi
Sakshi News home page

యత్నాళ్‌ బహిష్కరణపై పునరాలోచించాలి

Mar 28 2025 1:37 AM | Updated on Mar 28 2025 1:35 AM

సాక్షి,బళ్లారి: కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్‌ నాయకుడు, ఎమ్మెల్యేగా కొనసాగుతున్న బసవనగౌడ పాటిల్‌ యత్నాళ్‌ను పార్టీ నుంచి ఆరేళ్ల పాటు బహిష్కరించడంపై బీజేపీ హైకమాండ్‌ పునరాలోచించాలని మాజీ మంత్రి శ్రీరాములు పేర్కొన్నారు. ఆయన గురువారం నగరంలోని తన నివాసగృహంలో విలేకరులతో మాట్లాడారు. బసవనగౌడ పార్టీ పరంగా బ్యాటింగ్‌ చేశారన్నారు. అలా నేరుగా మాట్లాడటం మంచిది కాదని,పార్టీ నిబంధనలకు లోబడి పనిచేస్తే మంచిదని తాను ముందు నుంచి యత్నాళ్‌కు సూచించానన్నారు. అయితే పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. యత్నాళ్‌ బహిష్కరణపై మరోసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉందన్నారు. యత్నాళ్‌ బలమైన పంచమశాలి లింగాయత్‌ సమాజానికి చెందిన నాయకుడన్నారు. ఆ కులానికి చెందిన వారు రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో ఉన్నారన్నారు. బీజేపీకి నష్టం జరగకుండా ఉండాలనేదే తన తపన అన్నారు. బలమైన హిందూ వాదిగా, పంచమశాలి లింగాయత్‌ సమాజానికి గొప్పనాయకుడుగా కొనసాగుతున్న యత్నాళ్‌ను పార్టీ నుంచి తప్పించడంపై పునరాలోచించాలని తాను ప్రధాని మోదీ, పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా, హోంమంత్రి అమిత్‌షాలను కోరుతున్నట్లు తెలిపారు.

కాంగ్రెస్‌ దుష్పరిపాలన

హొసపేటె: రాష్ట్రంలో కాంగ్రెస్‌ దుష్పరిపాలన సాగిస్తోందని మాజీ మంత్రి బీ.శ్రీరాములు తెలిపారు. బుధవారం నగరంలోని అంబేడ్కర్‌ సర్కిల్‌లో బీజేపీ ఆధ్వర్యంలో కాంగ్రెస్‌ పాలనలో జరిగిన హనీట్రాప్‌పై కాంగ్రెస్‌ పాలనకు వ్యతిరేకంగా నిరసన తెలియజేశారు. ప్రభుత్వ కాంట్రాక్టుల్లో రిజర్వేషన్లు సృష్టించిందన్నారు. ఈ ప్రభుత్వం మైనార్టీల అభివృద్ధి గురించి మాత్రమే శ్రద్ధ వహిస్తోందన్నారు. రాబోయే రోజుల్లో దీని పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన అన్నారు. అనంతరం ముఖ్యమంత్రి దిష్టిబొమ్మకు నిప్పంటించారు. ఈ సందర్భంగా బీజేపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

నిఖార్సయిన హిందుత్వవాది

మాజీ మంత్రి శ్రీరాములు వెల్లడి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement