సాక్షి,బళ్లారి: సమాజాభివృద్ధికి, వెనుకబడిన వర్గాల సంక్షేమం కోసం ఎల్.జీ.హావనూరు చేసిన కృషి ఎన్నటికీ మరవలేనిదని అఖండ కర్ణాటక వాల్మీకి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జోళదరాశి తిమ్మప్ప పేర్కొన్నారు. ఆయన మంగళవారం నగరంలోని గాంధీనగర్‌లోని అఖండ కర్ణాటక వాల్మీకి నాయకుల ఐక్యత కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాజీ మంత్రి, సమాజసేవకుడు ఎల్.జీ.హావనూరు 98వ జయంత్యుత్సవంలో పాల్గొని మాట్లాడారు. కుల, మతాలకు అతీతంగా పేదల సంక్షేమం కోసం పాటుపడిన మహానుభావుడని కొనియాడారు. హావనూరు అడుగుజాడల్లో మనందరం నడవాల్సిన అవసరం ఉందన్నారు. ఆయన పోరాట యోధుడని, పేదలను ముందుకు తీసుకెళ్లేందుకు తన వంతు కృషి చేశారని కొనియాడారు. కార్యక్రమంలో వాల్మీకి సంఘం ప్రముఖులు వై.రాజా(కేఎస్‌ఆర్‌టీసీ), ముదిమల్లప్ప, వీరాపుర