విందు భోజనం.. కలుషితం | - | Sakshi
Sakshi News home page

విందు భోజనం.. కలుషితం

Mar 17 2025 11:11 AM | Updated on Mar 17 2025 11:07 AM

మండ్య: హోలీ పండుగ రోజున అనాథాశ్రమంలో భోజనం చేసిన బాలలు అస్వస్థత పాలయ్యారు. వారిలో ఒకరు చనిపోగా, మరో 27 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. జిల్లాలోని మళవళ్లి తాలూకాలోని కాగేపుర గ్రామంలో ఉన్న గోకుల అనాథాశ్రమంలో శనివారం ఓ వ్యాపారి విందు భోజనం సమకూర్చారు. తిన్న తరువాత బాలలకు కడుపునొప్పి, వాంతులు, విరేచనాలు మొదలయ్యాయి. వెంటనే వైద్యులకు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి చికిత్స చేశారు. మెరుగైన చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. అందులో మేఘాలయాకు చెందిన 6వ తరగతి విద్యార్థి అయిన కేర్లాంగ్‌ (13) పరిస్థితి విషమించి కిందపడిపోయాడు. పరీక్షించిన వైద్యులు అతడు మరణించాడని తెలిపారు. మొత్తం 27 మంది అనారోగ్యానికి గురయ్యార. ఇతర రాష్ట్రాలకు చెందిన బాలలు ఉన్నారు. ఇద్దరు మాత్రమే కన్నడిగులని తెలిసింది. బాధితులు మళవళ్లి తాలూకా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. బాలుని మృతదేహాన్ని మండ్య మిమ్స్‌కు తరలించారు. కలెక్టరు కుమార్‌, ఎస్పీ మల్లికార్జున బాలదండి ఆస్పత్రికి వచ్చి పరిశీలించారు. భోజనం కలుషితం కావడం వల్లే ఇలా జరిగిందని సమాచారం.

27 మంది బాలలకు అస్వస్థత

ఒకరు మృత్యువాత

అనాథాశ్రమంలో ఘటన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement