కొప్పళ డీసీకి అవార్డు
హుబ్లీ: ఓటర్ల నమోదుతో పాటు చైతన్యం కల్పించేందుకు విశేషంగా కృషి చేసిన జిల్లా కలెక్టర్లకు రాష్ట్ర ఎన్నికల సంఘం అవార్డులు ప్రదానం చేసింది. కొప్పళ జిల్లా అధికారి డాక్టర్ సురేష్ బి హిట్నాల్‌కు బెంగళూరులో గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్ అవార్డు అందజేశారు.
దేవదుర్గ అభివృద్ధే లక్ష్యం
రాయచూరు రూరల్: దేవదుర్గ తాలుకా అభివృద్ధే తమ లక్ష్యం. తాలుకా అభివృద్ధికి ప్రజలు సహకరించాలని దేవదుర్గ శాసన సభ్యురాలు కరెమ్మ పేర్కొన్నారు. ఆదివారం క్రీడా మైదానంలో వివిధ అభివృద్ధి పనులకు భూమిపూజ చేసి మాట్లాడారు. భవిష్యత్తులో తాలుకాను సుందరంగా తీర్చిదిద్దేందకు ప్రజల ఆశ్వీరాదం తమకు రక్ష అన్నారు. క్రీడలకు రూ.8 కోట్లు, రహదారులకు రూ.5 కోట్లు వెచ్చించి పనులు చేపట్టామన్నారు. కార్యక్రమంలో సిద్ధణ్ణ, శరణప్ప, తిమ్మారెడ్డి, బసవరాజ్, రామన్న, వెంకన్న గౌడ, గోవింద రాజ్ తదితరులు పాల్గొన్నారు.
జూన్‌లోపు డ్యాం గేట్ల
పనుల పూర్తి కష్టమే
హొసపేటె: తుంగభద్ర ఆనకట్ట 33 క్రస్ట్ గేట్లను మార్చి కొత్త గేట్ల ఏర్పాటుకు నిధుల కొరత ఉందని కాంట్రాక్టర్లు చెబుతున్నారు. ఇలా అయితే జూన్‌లోపు డ్యాం క్రస్ట్ పనుల పూర్తి కష్టమే అని క్రస్ట్ గేట్ నిపుణుడు కన్నయ్య నాయుడు తెలిపారు. కర్ణాటక ప్రభుత్వం రూ.10 కోట్లు అందించకుండా తిరిగి వాపాసు తీసుకోవడం సరికాదన్నారు. నిధుల కొరతతో క్రస్ట్ గేట్ల ఏర్పాటు పనులు ఆగిపోయే అవకాశం ఉందని పేర్కొన్నారు. డబ్బు చెల్లించకుండా వేధిస్తున్నారని కాంట్రాక్టర్లు తనకు ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. కర్ణాటక స్పందించకపోతే పనులు పూర్తి కావని హెచ్చరించారు.
కొప్పళ డీసీకి అవార్డు
కొప్పళ డీసీకి అవార్డు


