సూర్యాయ.. శుభప్రదాయ నమః
మండ్య హాలేనగరలో లక్ష్మీ జనార్ధన ఉత్సవం
తుమకూరు చిక్కపేటలో లక్ష్మీకాంతస్వామి రథోత్సవం
సొణపణహట్టిలో చంద్రమౌళీశ్వర బ్రహ్మ రథోత్సవ దృశ్యం
తుమకూరు: సమస్త లోకాలలో చీకటిని పారదోలి వెలుగులు పంచే సూర్యభగవానుని రథసప్తమి పర్వదినాన్ని రాష్ట్రమంతటా ఆదివారం భక్తిశ్రద్ధలతో ఆచరించారు. ప్రముఖ ఆలయాలలో పూజలు, రథోత్సవాలు జరిగాయి. తుమకూరు నగరంలోని చిక్కపేట సర్కిల్‌లో రథసప్తమి రోజున లక్ష్మీకాంతస్వామివారి బ్రహ్మరథోత్సవం నేత్రపర్వంగా సాగింది. వేలాదిమంది భక్తులు పాల్గొన్నారు.
చంద్రమౌళీశ్వరా శరణు
మాలూరు: తాలూకాలోని కుడియనూరు గ్రామ పంచాయతీ వ్యాప్తిలోని సొణపణహట్టి గ్రామ గేట్ సమీపంలో వెలసిన చంద్రమౌళీశ్వర స్వామి ఆలయం బ్రహ్మ రథోత్సవ వేడుకలను ఆదివారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. వేలాదిగా భక్తజనం పాల్గొన్నారు. సాయంత్రం గిరిజా కళ్యాణోత్సవం జరిగింది.
మండ్యలో ఊరేగింపు
మండ్య: రథసప్తమి పర్వదినం సందర్భంగా ఆదివారం మండ్య నగరంలోని హాలేనగరలోని శ్రీ లక్ష్మీ జనార్ధన ఆలయంలో సూర్యమండల వాహనంలో స్వామివారిని ఊరేగించారు. మంగళ వాయిద్యాలు, విశేష పూజల నడుమ కనులపండువగా వేడుక సాగింది. వందలాదిగా భక్తులు పాల్గొన్నారు.
కొడియాళ తేరు
మంగళూరులో తేరు వీధిలోని శ్రీవెంకట రమణ ఆలయంలో బ్రహ్మ రథోత్సవంగా ప్రసిద్ధి చెందిన కొడియాళ తేరు సంబరం అట్టహాసంగా జరిగింది. వేలాది భక్తుల నడుమ వెంకటరమణుని రథోత్సవం, పల్లకీ సేవ ఆకట్టుకున్నాయి. మైసూరు, బెంగళూరుతో సహా అనేక ప్రాంతాలలో సామూహిక సూర్య నమస్కారాలు, యోగాచరణ నిర్వహించారు.
రాష్ట్రమంతటా
రథసప్తమి సంభ్రమం
రథోత్సవాలు, జాతరల
ఆర్భాటం
సూర్యాయ.. శుభప్రదాయ నమః
సూర్యాయ.. శుభప్రదాయ నమః
సూర్యాయ.. శుభప్రదాయ నమః
సూర్యాయ.. శుభప్రదాయ నమః


