అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టివేత
రాయచూరు రూరల్: అక్రమంగా తరలిస్తున్న 13 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. వివరాలు.. ఆదివారం రాయచూరు తాలుకా శక్తి నగరం వద్ద వడగేర నుంచి గద్వాల వైపు వెళ్తున్న కేఏ 33 ఎఫ్ 3843 నంబర్ లారీని పోలీసులు ఆపి తనిఖీ చేశారు. అన్నభాగ్య పథకంలో భాగంగా పేదలకు పంపిణీ చేయకుండా నల్ల బజారుకు బియ్యం తరలిస్తున్నట్లు గుర్తించారు. మహ్మద్ హజరత్ అలీ, మెహబూబ్, సోహెల్‌ను అదుపులోకి తీసుకున్నారు. బియ్యంతో పాటు లారీని సీజ్ చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు శక్తినగర్ పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ నారాయణ వివరించారు.
ఫిబ్రవరిలో
ఏడదొరె జిల్లా ఉత్సవాలు
రాయచూరు రూరల్: జిల్లాలో ఫిబ్రవరి 5 నుంచి 7వ తేదీ వరకూ (మూడు రోజులు) జరగనున్న రాయచూరు ఏడదొరె జిల్లా ఉత్సవాలను విజయవంతం చేయాలని నగరసభ ఉప కమిషనర్ సంతోష్ రాణి కోరారు. ఉత్సవాల నిర్వహణపై ఆర్టీసీ బస్టాండ్‌లో ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాటఆలడుతూ.. మూడు రోజుల పాటు జిల్లాలో ఉత్సవాలు నిర్వహిస్తామన్నారు. రాయచూరు వ్యవసాయ విశ్వ విద్యాలయం, మహిళా సమాజ్, రంగ మందరిం, మహత్మా గాంధీ క్రీడా మైదానం, కర్ణాటక సంఘం ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. 300 మంది కళాకారులతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. కవి గోష్టులు, మత్య్స మేళా, వ్యవసాయ మేళా, పిల్లల మేళాలు ఏర్పాటు చేశామన్నారు. సమావేశంలో అధికారులు సదా శివప్ప, క్రిష్ణ, నాగరాజ్ తదితరులు పాల్గొన్నారు.
అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టివేత


