హిందువుల రక్షణకు ఐక్య పోరాటం
బళ్లారి అర్బన్: దేశంలో హిందువులకు తగిన రక్షణ లేకుండా పోతోంది. హిందువుల హక్కుల, భద్రత కోసం అంతర్జాతీయ హిందూ పరిషత్, జాతీయ బజరంగ్‌దళ్ కలిసి ఉద్యమాలు చేస్తున్నాయని అంతర్జాతీయ హిందూ పరిషత్ సహ సంఘటన కార్యదర్శి ప్రదీప్‌గార తెలిపారు. ఆదివారం ప్రెస్‌క్లబ్‌లో విలేకరులతో మాట్లాడారు. బళ్లారి జిల్లాలో హిందువులపై జరుగుతున్న దాడులు, అన్యాయాలపై చర్చించడం జరుగుతుందన్నారు. వాటికి వ్యతిరేకంగా చేపట్టాల్సిన కార్యాచరణపై నిర్ణయాలు తీసుకుంటామని తెలిపారు. హిందువులను రక్షిస్తున్నట్లు చెప్పుకునే కొన్ని సంఘాలు ఆశించిన స్థాయిలో పని చేయడం లేదని ఆరోపించారు. కార్యక్రమంలో సంఘం నాయకులు రమేష్ కులకర్ణి, మల్లికార్జున అద్వానీ, గంగాధర్ విశ్వకర్మ ముఖేష్ మోదీ, సాగర్ సామ్రాట్, శ్రీకాంత్, మోహన్ బిలాన్, అనిల్ సాలంకి పాల్గొన్నారు.


