స్వచ్ఛతకు సహకరించాలి
రాయచూరు రూరల్: నగర స్వచ్ఛతకు అందరు సహకరించాలని అదనపు జిల్లా అధికారి శివానంద పిలుపునిచ్చారు. ఆదివారం మహత్మా గాంధీ క్రీడా మైదానంలో నగర సభ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మారథాన్ ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నగర పరిదిలో స్వచ్ఛతకు తోడు పరిసరాలను సంరక్షించడం ద్వారా నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దడానికి యువకులు ముందుకు రావాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు జిల్లా అధికారి శివానంద, ఏసీ హంపన్న, నగర సభ కమిషనర్ జుబీన్ మోహపాత్రో, సంతోష్ రాణి తదితరులు పాల్గొన్నారు.
సమస్యల పరిష్కారానికి కృషి
రాయచూరు రూరల్: నగరంలో అభివృద్ధికి తోడు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని విధాన పరిషత్ సభ్యుడు వసంత్ కుమార్ పేర్కొన్నారు. ఆదివారం నగరంలో కార్యాయాలన్ని ప్రారంభించి మాట్లాడారు. నగరంలో సౌలభ్యాల కోసం రక్షణ గోడ, హైమాస్ విద్యుత్ లైట్లు, మురుగు కాలువల నిర్మణానికి చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు బసవరాజ్ పాటిల్ ఇటగీ, మురళీ యాదవ్, రమేష్, ఈశప్ప తదితరులు పాల్గొన్నారు.
గ్రామీణ జాతీయ
బ్యాంక్‌గా మార్చేందుకు కృషి
బళ్లారి అర్బన్: కర్ణాటక గ్రామీణ బ్యాంక్‌ను విలీనం చేయవద్దు.. జాతీయ బ్యాంక్‌గా మార్చేందుకు ఐక్యమత్యంతో కృషి చేయాలని ఎన్‌ఎఫ్‌ఆర్‌ఆర్‌ఆర్‌బీఎస్ జనరల్ సెక్రటరీ అబ్దుల్ సయ్యద్‌ఖాన్ సూచించారు. ఆదివారం స్థానిక జనతా బజార్ సమీపంలో కర్ణాటక గ్రామీణ బ్యాంక్ రిటైర్డ్ ఉద్యోగుల ఫెడరేషన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గ్రామీణ బ్యాంకుల స్వర్ణ మహోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బ్యాంకుల విలీనం చేయడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదన్నారు. రైతులు, గ్రామీణ ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. గౌరవ అధ్యక్షుడు గణపతి హెగ్డే, అధ్యక్షుడు సి.వెంకటరామప్ప, కార్యాధ్యక్షుడు ఎన్‌టి వేణుగోపాల శెట్టి పాల్గొన్నారు.
స్వచ్ఛతకు సహకరించాలి


