మొక్కు తీర్చుకుని వస్తుండగా.. | Sakshi
Sakshi News home page

మొక్కు తీర్చుకుని వస్తుండగా..

Published Sun, May 19 2024 2:25 AM

మొక్క

సాక్షి, బళ్లారి/హొసపేటె: ఓ ప్రైవేటు బస్సు వేగంగా వస్తూ ట్రాక్టర్‌ను వెనుక నుంచి ఢీకొనడంతో ట్రాలీ బోల్తా పడి నలుగురు మృతి చెందిన ఘటన కొప్పళ జిల్లా యలబుర్గ తాలూకాలో చోటు చేసుకుంది. వివరాలు.. శివప్ప హొసమని తన బంధువులను హులిగికి తీసుకెళ్లాడు. జాతీయ రహదారి 50లో శుక్రవారం రాత్రి జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో యలబుర్గ తాలూకా కరముడి గ్రామానికి చెందిన బసవరాజు(22), తేజస్‌ అలియాస్‌ ముత్తప్ప(21), దుర్గమ్మ(65), గదగ్‌ జిల్లా తిమ్మాపుర గ్రామానికి చెందిన కొండప్ప(60) అనే నలుగురు మృతి చెందారు. వేగంగా వస్తున్న ప్రైవేటు బస్సు వెనుక నుంచి ట్రాక్టర్‌ను ఢీకొనడంతో ట్రాక్టర్‌ ట్రాలీలో ఉన్న వారిలో నలుగురు మృతి చెందారు. ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా, ఒక మహిళ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. 15 మందికి పైగా గాయాలయ్యాయి.

మృతుల కుటుంబాల్లో తీవ్ర విషాదం

కరముడి గ్రామం నుంచి 30 మందికి పైగా గ్రామస్తులు హులిగమ్మ దేవి ఆలయానికి ట్రాక్టర్‌లో వెళ్లి మొక్కు తీర్చుకుని తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగింది. శుక్రవారం అమ్మవారి ఆలయంలో విశేష పూజలు, అన్నదాన కార్యక్రమాలు పూర్తి చేసుకొని తిరిగి వస్తుండగా ఈ ఘటన జరగడంతో మృతుల కుటుంబాల్లో తీవ్ర విషాదం అలుముకుంది. తీవ్రంగా గాయపడిన వారు కొప్పళ జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. జిల్లా ఎస్పీ, స్థానిక పోలీసు అధికారులు ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఎస్పీ మాట్లాడుతూ ట్రాక్టర్‌ను వెనుక నుంచి ప్రైవేటు బస్సు వేగంగా వచ్చి ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగిందన్నారు. ఘటనలో నలుగురు మృతి చెందడంతో పాటు మరో ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని, బస్సు డ్రైవర్‌ పరారీలో ఉన్నాడన్నారు. ఘటనాస్థలాన్ని జిల్లా ఎస్పీ యశోదా వంటగోడి సందర్శించారు. కేసు దర్యాప్తులో ఉంది.

ట్రాక్టర్‌కు బస్సు ఢీ–నలుగురు మృతి

కొప్పళ జిల్లా యలబుర్గాలో ఘోరం

మొక్కు తీర్చుకుని వస్తుండగా..
1/2

మొక్కు తీర్చుకుని వస్తుండగా..

మొక్కు తీర్చుకుని వస్తుండగా..
2/2

మొక్కు తీర్చుకుని వస్తుండగా..

Advertisement
 
Advertisement
 
Advertisement