గుండెను కాపాడుకుందాం | - | Sakshi
Sakshi News home page

గుండెను కాపాడుకుందాం

Oct 24 2026 12:28 AM | Updated on Oct 24 2026 12:28 AM

● వయస్సుతో సంబంధం లేకుండా హార్ట్‌ ఎటాక్‌ ● మారుతున్న జీవనశైలి, మానసిక ఒత్తిడి కారణమే ● ఉమ్మడి జిల్లాలో ప్రతి నెలా వందల సంఖ్యలో బాధితులు ● ఛాతీలో నొప్పిని అశ్రద్ధ చేయొద్దంటున్న వైద్యులు

● వయస్సుతో సంబంధం లేకుండా హార్ట్‌ ఎటాక్‌ ● మారుతున్న జీవనశైలి, మానసిక ఒత్తిడి కారణమే ● ఉమ్మడి జిల్లాలో ప్రతి నెలా వందల సంఖ్యలో బాధితులు ● ఛాతీలో నొప్పిని అశ్రద్ధ చేయొద్దంటున్న వైద్యులు

కరీంనగర్‌: మనిషి శరీరంలో పనిచేసే అవయవాల్లో అతి ప్రధానమైనది గుండె. ప్రస్తుతం దీనికి భద్రత లేకుండా పోతుంది. వృద్ధుల్లోనే కాకుండా యువతలోనూ గుండె జబ్బుల ప్రమాదం వేగంగా పెరుగుతోంది. మారుతున్న అలవాట్లతో ఊబకాయం, మధుమేహం, అధిక రక్తపోటు, మూత్రపిండాల సమస్యలకు దారితీయడంతోపాటు అంతిమంగా గుండైపె ఆ ప్రభావం పడుతోంది. అధిక కొవ్వుతో గుండెపోటుకు గురై ప్రాణాలు వదులుతున్న ఘటనలు అనేకం. కార్డియాక్‌ అరెస్ట్‌, సైలెంట్‌ హార్ట్‌ ఎటాక్‌తో ప్రాణాలు పోతున్నాయి. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో గుండె సమస్యలతో బాధపడే వారు 35శాతం ఉన్నట్లు అంచనా. వీరిలో మగవారు 22శాతం, మహిళలు 13 శాతం ఉన్నట్లు తెలుస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో 40 శాతం, పట్టణాల్లో వీరి సంఖ్య 56 శాతం ఉంటుందని వైద్యాధికారులు తేల్చారు. ఆకస్మిక హృద్రోగ సమస్య ఎదురైన వారిలో 10 శాతం మంది మాత్రమే చికిత్స తీసుకుని కోలుకుంటున్నారు. ఉమ్మడి జిల్లాలో ప్రతి నెలా సుమారు 5,000 మంది గుండె వైద్య నిపుణులను సంప్రదిస్తుండగా, 500 మందికిపైగా స్టంట్లు వేసుకుంటున్నారు. సుమారు 100 వరకు బైపాస్‌ సర్జరీలు జరుగుతున్నాయి.

కారణాలు ఇవే..

గుండెపోటుకు మన జీవనశైలిలో మార్పులే ప్రధాన కారణం. హోటళ్లలో బిర్యానీలు, జంక్‌, ఫాస్ట్‌ఫుడ్‌, మితిమీరిన పార్టీలు, అర్ధరాత్రి వేళ నాన్వెజ్‌ తీసుకోవడం వంటివి గుండెపోటుకు కారణమవుతున్నాయి. హ ర్మోన్ల ప్రభావం కొంత వరకు ఉంటుంది. కంప్యూటర్లు, సెల్ఫో న్లు పట్టుకొని గంటల తరబడి కూ ర్చుకునేవారు, రాత్రివేళలో నిద్రపోకుండా మేల్కొని ఉండేవారు, అతిగా ఆహా రం తీసుకునేవారు, ఏ పనిచేయని వారు గుండెపో టు బారిన పడుతున్నారు. మానసిక ఒత్తిడి, ఆర్థిక ఇబ్బందులు గుండెపోటుకు దారితీస్తున్నాయి.

గుర్తించాలి ఇలా..

ఛాతి బరువుగా ఉండడం. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, తలతిప్పడం వంటి వాటిని గుండెపోటు ప్రథమ లక్షణాలుగా భావించి వెంటనే గుండె వైద్యనిపుణులను కలిసి చికిత్స తీసుకోవాలి. ఈసీజీ, 2డీకో తర్వాతే గుండె సమస్య తీవ్రత తెలుస్తుంది. ఆ తర్వాత చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు

మాంసాహారం తక్కువగా, పండ్లు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి. రోజూ వ్యాయామం చేయాలి. హోటల్‌ ఫుడ్‌కు దూరంగా ఉండాలి. బీపీ, షుగర్‌ కంట్రోల్‌లో ఉంచుకోవాలి. స్మోకింగ్‌, ఆల్కాహాల్‌కు దూరంగా ఉండాలి. గుండెజబ్బులు లేకున్నా భారీ శబ్ధాలకు దూరంగా ఉండాలి. స్టంట్లు వేసుకున్నవారు, గుండె సంబంధిత ఆపరేషన్లు చేసుకున్న వారు డీజేల వద్దకు వెళ్లొద్దు.

ప్రాణాలు కాపాడే ‘సీపీఆర్‌’

సీపీఆర్‌ (కార్డియోపర్మోనరీ రిసుస్కిటేషన్‌)పై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి. గుండె కొట్టుకోవడం ఆగిన వెంటనే సీపీఆర్‌ చేస్తే శ్వాసక్రియ పునరుద్ధరణతో పాటు ప్రాణాలు కాపాడొచ్చు. దీనిపై పలు వైద్యులతో పాటు స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో అవగాహన కల్పించాల్సి ఉంది. అయితే గుండెపోటుకు గురైన పదిమందిలో ఒకరు మాత్రమే సీపీఆర్‌ ద్వారా ప్రాణాలతో బయటపడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement