రన్నింగ్‌ స్టాఫ్‌ సమస్యలు పరిష్కరించాలి | - | Sakshi
Sakshi News home page

రన్నింగ్‌ స్టాఫ్‌ సమస్యలు పరిష్కరించాలి

Oct 24 2026 12:28 AM | Updated on Oct 24 2026 12:28 AM

● 26న సంచాలన్‌ భవన్‌లో నిరాహార దీక్ష ● రైల్వే మజ్దూర్‌ యూనియన్‌ సికింద్రాబాద్‌ డివిజన్‌ ప్రధాన కార్యదర్శి రవీందర్‌

● 26న సంచాలన్‌ భవన్‌లో నిరాహార దీక్ష ● రైల్వే మజ్దూర్‌ యూనియన్‌ సికింద్రాబాద్‌ డివిజన్‌ ప్రధాన కార్యదర్శి రవీందర్‌

రామగుండం: లోకో పైలట్లు, అసిస్టెంట్‌ లోకోపైలట్లు, ట్రైన్‌ మేనేజర్లు తదితర రన్నింగ్‌ సిబ్బంది రైలు భద్రత, నిర్వహణలో కీలకపాత్ర పోషిస్తున్నారని, వారి సమస్యలను పరిష్కరించడంలో రైల్వేశాఖ విఫలమవుతోందని దక్షిణ మధ్య రైల్వే మజ్దూర్‌ యూనియన్‌ సికింద్రాబాద్‌ డివిజనల్‌ ప్రధాన కార్యదర్శి పిల్లలమర్రి రవీందర్‌ శుక్రవారం విమర్శించారు. హ్యాండీ క్యాప్డ్‌, పైలట్‌ సెక్షన్లకు ఆమోదం కల్పించాలనే డిమాండ్‌తో ఈనెల 26న సికింద్రాబాద్‌లోని సంచాలన్‌ భవన్‌ ఎదుట నిరాహార దీక్ష చేపడుతున్నామని తెలిపారు. అన్ని అర్హత కలిగిన సెక్షన్లకు సమన్యాయం జరగాలని, రన్నింగ్‌ సిబ్బంది విపత్కర పరిస్థితుల్లో విధులు నిర్వహిస్తున్నా పెండింగ్‌ ప్రతిపాదనలపై తక్షణ నిర్ణయం తీసుకోవాలని పేర్కొన్నారు. ప్రతీ సైన్‌–ఆన్‌ నుంచి సైన్‌–ఆఫ్‌ వరకు కనీసం 120 కి.మీ. అలవెన్స్‌ వర్తించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. నిరాహార దీక్షలో లోకో, ట్రాఫిక్‌ శాఖలకు చెందిన రన్నింగ్‌ సిబ్బంది, మజ్దూర్‌ యూనియన్‌ డివిజనల్‌ కార్యవర్గాల సభ్యులు అందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement