గంగాధర: మండలంలోని మధురానగర్ గ్రామానికి చెందిన రాసూరి శ్రీలత (35) చికిత్స పొందుతూ మృతిచెందింది. పోలీసుల వివరాలు.. శ్రీలతకు మల్లాపూర్ గ్రామానికి చెందిన వ్యక్తితో వివాహం జరిగింది. కాగా వీరు ఇటీవల విడాకులు తీసుకున్నారు. అప్పటి నుంచి శ్రీలత తల్లిదండ్రుల ఇంట్లో ఉంటోంది. ఆదివారం గర్శకుర్తి గ్రామంలో క్రిమిసంహారక మందు కొనుగోలు చేసి తాగింది. స్థానికులు గమనించి కరీంనగర్ ఆస్పత్రికి తరలించగా, చికిత్సపొందుతూ సోమవారం మృతిచెందింది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
పొలంలో పడి ఊపిరాడక రైతు..
గంగాధర: మండలంలోని కాచిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన రైతు సరిపల్లి నరసయ్య పొలంలో పడి మృతిచెందినట్లు గ్రామస్తులు తెలిపారు. నరసయ్య సోమవారం పొలం వద్దకు వెళ్లి గట్టుపై నుంచి నడుస్తుండగ ప్రమాదవశాత్తు కాలు జారి పొలంలో పడిపోయాడు. దీంతో ఊపిరి ఆడక అక్కడికక్కడే మృతిచెందినట్లు గ్రామస్తులు వివరించారు.


