దక్షిణ భారతదేశంలో ఎక్కడా లేనివిధంగా పశ్చిమ ద్వారం, పశ్చిమముఖం కలిగిన శివలింగం మంథనిలోనే ఉంది. భిక్షేశ్వరాలయంగా పిలువబడే ఈ ఆలయంలో వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులు ప్రత్యేక పూజలు జరుపుతారు. శ్రావణంలో శివపార్వతుల పూజకు ప్రాధాన్యత ఉండడంతో సోమవారం శివాలయాలను దర్శించి పూజలు చేస్తారు. శ్రీలేశ్వర– సిద్ధేశ్వర, సురాబాండేశ్వరుడు, గౌతమేశ్వర, ఓంకారేశ్వరుడు కొలుౖవై ఉన్నారు. ఇలా శ్రావణంలో నెలరోజులపాటు భక్తులు భక్తిశ్రద్ధలతో దేవతామూర్తులను కొలిచేందుకు మంత్రపురి సిద్ధంగా ఉంది.


