మండల ఎస్జీఎఫ్ పోటీలను అట్టహాసంగా నిర్వహిస్తాం. గ్రామీణ ప్రాంత విద్యార్థుల్లో అద్భుతమైన క్రీడా నైపుణ్యం ఉంటుంది. గడువు లోపు మా మండలంలోని పాఠశాలలన్నింటినీ సమన్వయం చేసుకుంటూ, క్రీడా పోటీలు పారదర్శకంగా నిర్వహిస్తాం. ప్రతిభ గల క్రీడాకారులను గుర్తించి జిల్లా స్థాయి పోటీలకు పంపుతాం.
– గిన్నె లక్ష్మణ్,
కొత్తపల్లి మండల కార్యదర్శి
పకడ్బందీగా పోటీలు
ఎస్జీఎఫ్ మండలస్థాయిలోనే బలమైన పునాది వేస్తేనే విద్యార్థులు రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో రాణించగలరు. శంకరపట్నం మండలంలో ఎస్‌జీఎఫ్ క్రీడలను పకడ్బందీగా నిర్వహించేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నాం. ముఖ్యంగా బాలికలు అన్ని రకాల ఆటల్లో ఉత్సాహంగా పాల్గొనేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటాం. డీఈవో ఆదేశాల ప్రకారం 10 లోపు పోటీల ప్రక్రియ విజయవంతంగా పూర్తి చేస్తాం. – శ్రీనివాస్, శంకరపట్నం కార్యదర్శి


