50 వేల మందితో మహాధర్నా | - | Sakshi
Sakshi News home page

50 వేల మందితో మహాధర్నా

Sep 1 2026 12:31 AM | Updated on Sep 1 2026 12:31 AM

జగిత్యాల: పీఆర్సీ సాధన, సీపీఎస్‌ రద్దు కోసం మంగళవారం హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్‌ వద్ద 50 వేల మంది ఉపాధ్యాయులతో మహాధర్నా నిర్వహిస్తున్నట్లు పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు దామోదర్‌రెడ్డి అన్నారు. సోమవారం జిల్లాకేంద్రంలో పీఆర్టీయూ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూన్‌ 2న పీఆర్సీ నివేదిక తెప్పించుకున్న సీఎం వెంటనే అమలు చేస్తామని హామీ ఇచ్చి మూడు నెలలు గడుస్తున్నా ప్రకటించలేదన్నారు. జీవో 25ను సవరించి ప్రాథమిక పాఠశాలల బలోపేతానికి కృషి చేస్తామన్నారు. అనంతరం జిల్లా కమిటీని ప్రకటించారు. అధ్యక్షుడిగా యాళ్ల అమర్‌నాథ్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా బోయినిపల్లి ఆనందరావు, అసోసియేట్‌ అధ్యక్షుడిగా రాపర్తి నర్సయ్య, జక్కుల నవీన్‌కుమార్‌, గూడూరి శ్రీదేవి, సంగనభట్ల ప్రశాంతి, ఉపాధ్యక్షులుగా గంగ ప్రసాద్‌, రాజేందర్‌, నడిగడ్డ రాజు, ప్రశాంత్‌, శ్రీనివాస్‌, శ్వేత, సరస్వతి, కార్యదర్శులను ఎన్నుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement