తెలుగునేల పుణికిపుచ్చుకొన్న శిల్పకళా సంపద, ప్రాచీన సంస్కృతికి అద్దం పడుతోంది రామగిరి ఖిల్లా. క్రీ.శ.1వ శతాబ్దంలో రామగిరి కోటగా రూపుదిద్దుకుంది. రామగిరి మండలంలో ఈ ఖిల్లా ఉంది. ఎంతోఎత్తు గల దుర్గం, అనేక రాతికట్టడాలు, బురుజులు, ఫీనాలతో విరాజిల్లుతోంది. దుర్గం అంతర్భాగంలో సాలుకోట, సింహాలకోట, జంగేకోట, ప్రతాపరుద్రులకోట, అశ్వాల, కొలువుశాల, మొఘల్‌శాల, చెరశాల, గజశాల, భజనశాల, సభాస్థలితో పాటు రహస్య స్థలాలు, రహస్య మార్గాలు, సొరంగాలు, తీపులు, ఫిరంగి గుండ్లు దర్శనమిస్తాయి. తెలంగాణలోని దుర్గాల్లో ఈ దుర్గం పటిష్టంగా ఉండి వజ్రకూటంగా ప్రసిద్ధి చెందింది.


