మధ్యాహ్నం అయ్యింది.
ఆకాశంలో నల్ల మబ్బులు.
గాలి వీచింది.
‘టప టప’ వాన మొదలైంది.
వెంటనే ‘టప్’ అని కరెంట్ పోయింది.
ఇల్లంతా చీకటి.
బన్నీకి భయం. ‘ఇప్పుడు ఏం చేద్దాం?’ అన్నాడు.
తాతయ్య నవ్వాడు. ‘ఆట ఆడదాం.’
నానమ్మ లాంతరు వెలిగించింది.
చిన్న వెలుగు వచ్చింది.
అందరూ లాంతరు చుట్టూ కూర్చున్నారు.
తాతయ్య నేల మీద గుంటలు చేశాడు.
చిన్న చిన్న గుంటలు.
ఒక పెద్ద డబ్బాలో చింత గింజలు తెచ్చాడు.
‘ఇవి వామన గుంటలు’ అన్నాడు తాతయ్య.
‘మన తాతల ఆట. ఫోన్ లేదు, బ్యాటరీ లేదు.’
రామ్, చుక్క, స్వప్న, బన్నీ కూర్చున్నారు.
తాతయ్య ఆట నేర్పాడు.
గింజలు ఏరుకోవాలి. లెక్క పెట్టాలి.
బన్నీ మొదటి సారి ఆడాడు.
ఓడిపోయాడు.
తాతయ్య అన్నాడు, ‘ఓడితే శిక్ష ఉంది.’
బన్నీకి భయం.
తాతయ్య నవ్వాడు.
‘శిక్ష ఏంటంటే... ఒక పొడుపు కథ చెప్పాలి.’
తాతయ్య అడిగాడు, ‘అరచేతిలో వైకుంఠం ఏమిటి?’
బన్నీ ఆలోచించాడు. తెలియలేదు.
చుక్క చెవిలో చెప్పింది, ‘దీపం!’
బన్నీ ‘దీపం!’ అన్నాడు.
అందరూ నవ్వారు. చప్పట్లు కొట్టారు.
బయట వాన. లోపల నవ్వు.
పిల్లలకి మాట:
ఓడిపోతే ఏడవకూడదు.
గెలిస్తే పొగరు వద్దు.
ఆడితే సంతోషం వెలగాలి.
డాక్టర్ కోట లక్ష్మణ్,
ప్రభుత్వ ఉపాధ్యాయుడు
ప్రాథమిక పాఠశాల,కాకర్లపల్లి,
మండలం: మంథని,
పెద్దపల్లి జిల్లా


