భీమన్న ఆలయంలోని శనీశ్వరుడికి ప్రత్యేక పూజలు చేస్తున్న భక్తులు
నగరేశ్వరస్వామి ఆలయంలో చండీ హోమం నిర్వహిస్తున్న అర్చకులు, హాజరైన భక్తులు
వేములవాడ: శని అమావాస్య, శని జయంతి సందర్భంగా శనివారం వేములవాడలోని వివిధ ఆలయాల్లో విశేష పూజలు నిర్వహించారు. శనేశ్వర స్వామికి తైలాభిషేకం చేశారు. నవగ్రహాల చుట్టూ తొమ్మిది ప్రదక్షిణలు చేసి, అంజన్నను దర్శించుకున్నారు. అనంతరం భీమేశ్వర స్వామికి ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. శనివారం అమావాస్య ప్రభావంతో భీమన్న దర్శనాలకు భక్తులు పెద్దగా రాలేదు.
నిత్య చండీ హోమం
నగరేశ్వరస్వామి ఆలయంలో నిత్య చండీ హోమాలు నిర్వహిస్తున్నట్లు ఈవో రమాదేవి తెలిపారు. ప్రతి రోజు ఉదయం 7 నుంచి 11 గంటల వరకు హోమాలు నిర్వహిస్తారని, ఈ హోమానికి రూ.1516గా టికెట్ నిర్ణయించినట్లు తెలిపారు. ఒక టికెట్‌పై ఇద్దరిని కూర్చోబెడతారని పేర్కొన్నారు.


