వసూళ్ల గ్యాంగ్‌ అరెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

వసూళ్ల గ్యాంగ్‌ అరెస్ట్‌

May 17 2026 7:08 AM | Updated on May 17 2026 7:08 AM

కరీంనగర్‌ రూరల్‌: జల్సాలకు అలవాటు పడి, గ్యాంగ్‌గా ఏర్పడి చంపుతామంటూ బెదిరిస్తూ డబ్బులు వసూళ్లు చేస్తున్న ముగ్గురిని కరీంనగర్‌రూరల్‌ పోలీసులు శనివారం అరెస్ట్‌ చేశారు. సీఐ నిరంజన్‌రెడ్డి కథనం మేరకు.. వావిలాలపల్లికి చెందిన పుతుంపరంబిల్‌ రోహన్‌(19) ఈ నెల 13న తీగలగుట్టపల్లిలో బాక్స్‌ క్రికెట్‌ ఆడేందుకు స్నేహితులతో కలిసి వెళ్లాడు. కిరాణం వద్ద నిల్చున్న రోహన్‌ వద్దకు కరీంనగర్‌లోని దుర్గమ్మగడ్డకు చెందిన దావ దర్శన్‌, గాంధీనగర్‌కు చెందిన కాసారపు రోహిత్‌కుమార్‌ అలియాస్‌ రిషి వచ్చి కొంతదూరం తీసుకెళ్లారు. అతనిపై దాడి చేసి డబ్బులు ఇవ్వాలంటూ బెదిరిస్తున్న క్రమంలో మరో వ్యక్తి కొనగాని మధు వచ్చి బావిలో తోసి చంపేస్తామంటూ బెదిరించాడు. రోహన్‌ తన వద్ద ఉన్న ఐఫోన్‌ ఇవ్వడంతో విడిచిపెట్టారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. శనివారం బొమ్మకల్‌ బైపాస్‌రోడ్డులో నిందితులను అరెస్టు చేశారు. వారినుంచి స్విఫ్ట్‌ డిజైర్‌ కారు, ఐఫోన్‌తో పాటు మూడు సెల్‌ఫోన్లు, రూ.5వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. దావ దర్శన్‌పై కరీంనగర్‌ త్రీటౌన్‌లో మూడు కేసులు, రోహిత్‌కుమార్‌పై కరీంనగర్‌ టూ టౌన్‌లో పోక్సో కేసు, మధుపై 1టౌన్‌లో గంజాయి కేసు ఇప్పటికే ఉందని సీఐ నిరంజన్‌రెడ్డి తెలిపారు. ముగ్గురిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచినట్లు వివరించారు.

Advertisement
 
Advertisement
Advertisement