అంత్య పుష్కరాలకు ప్రత్యేక బస్సులు | - | Sakshi
Sakshi News home page

అంత్య పుష్కరాలకు ప్రత్యేక బస్సులు

May 17 2026 7:08 AM | Updated on May 17 2026 7:08 AM

విద్యానగర్‌(కరీంనగర్‌): సరస్వతి నది అంత్య పుష్కరాలకు భక్తులకు ఇబ్బందులు ఏర్పడకుండా ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయాలని ఆర్టీసీ కరీంనగర్‌ రీజినల్‌ మేనేజర్‌ బి.రాజు సూచించారు. శనివారం కరీంనగర్‌ బస్‌స్టేషన్‌ ఆవరణలోని సమావేశ మందిరంలో రీజియన్‌ పరిధిలోని డిపో మేనేజర్లతో సమీక్ష నిర్వహించారు. ఏప్రిల్‌ మాసానికి సంబంధించి అన్ని డిపోల పనితీరు, ఆర్థిక పరిస్థితిపై సమీక్షించారు. వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని ఆన్ని బస్‌స్టేషన్లలో తాగునీటి వసతి కల్పించాలన్నారు. డిప్యూటీ రీజినల్‌ మేనేజర్లు ఎస్‌.భూపతిరెడ్డి, పి.మల్లేశం, డిపో మేనేజర్లు ఎం.శ్రీనివాస్‌, ఐ.మిజయమాధురి, ఎం.నాగభూషణం, ఎన్‌.వెంకన్న, వి.రవీంద్రనాఽఽథ్‌, వి.శ్రవణ్‌కుమార్‌, కె.కల్పన, ఎన్‌.మనోహర్‌, ఎం.సరస్వతి, ఎ.ప్రకాశ్‌రావు, బి.శ్రీనివాస్‌, రీజినల్‌ మేనేజర్‌ కార్యాలయం సూపర్‌వైజర్లు ఎం.స్రవంతి, ఎన్‌.జ్యోత్స్న పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement