రామగుండం: ధర్మవరం–నాందేడ్ వీక్లీ ఎక్స్‌ప్రెస్ రైలును ఆదివారం నుంచి క్రమబద్ధీకరిస్తూ దక్షిణ మధ్య రైల్వే ఉత్తర్వులు జారీచేసింది. నాందేడ్ – ధర్మవరం(17635) ప్రతీ శుక్రవారం రాత్రి 10.00గంటలకు పెద్దపల్లికి చేరుకుని 20 నిమిషాలపాటు ఆగుతుంది. ధర్మవరం–నాందేడ్(17636) పెద్దపల్లికి ప్రతీ ఆదివారం అర్ధరాత్రి 11.55 గంటలకు చేరుకుంటుంది. ఆర్మూర్, కోరుట్ల, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జమ్మికుంటలో హాల్టింగ్ కల్పించారు. ఆంధ్రప్రదేశ్‌లోని కదిరి లక్ష్మీనర్సింహస్వామి, తిరుపతి శ్రీవేంకటేశ్వరస్వామి, విజయవాడ కనకదుర్గమ్మ, వరంగల్ భద్రకాళి, బాసర శ్రీజ్ఞాన సరస్వతీ పుణ్యక్షేత్రాలకు వెళ్లేందుకు ఈరైలు సౌకర్యవంతంగా ఉంటుంది.


