రాయికల్(జగిత్యాల): రాయికల్ పట్టణం ఇందిరానగర్‌కు చెందిన హమలీ కార్మికుడు సందెళ్ల శేఖర్ (27) చెరువులో స్నానం చేసేందుకు వెళ్లి ఊపిరాడక మృతిచెందాడు. స్థానికులు తెలిపిన వివరాలు.. శేఖర్ తోటి హమాలీలతో కలిసి శుక్రవారం రాయికల్ పెద్ద చెరువు వద్ద విందు ఏర్పాటు చేసుకున్నారు. అనంతరం స్నానం చేసేందుకు శేఖర్ మద్యం మత్తులో చెరువులోకి వెళ్లగా ఈత వచ్చినప్పటికీ ఊపిరాడక మృతిచెందాడు. మృతుడికి భార్య, కొడుకు, కుమార్తె ఉన్నారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై దేవేందర్‌నాయక్ తెలిపారు.


