గంజాయి రవాణా కేసులో ఐదుగురి అరెస్టు | - | Sakshi
Sakshi News home page

గంజాయి రవాణా కేసులో ఐదుగురి అరెస్టు

May 16 2026 1:33 AM | Updated on May 16 2026 1:33 AM

జ్యోతినగర్‌: గంజాయిని రవాణా చేస్తున్న ఒడిశా రాష్ట్రానికి చెందిన ఐదుగురిని అరెస్టు చేసినట్లు డీసీపీ రాంరెడ్డి తెలిపారు. శుక్రవారం ఎన్టీపీసీ పోలీస్‌స్టేషన్‌లో గోదావరిఖని ఏసీపీ రమేశ్‌, రామగుండం సీఐ కృష్ణకుమార్‌, ఎన్టీపీసీ ఎస్సై ఉదయ్‌కిరణ్‌లతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఒడిశా నుంచి హైదరాబాద్‌కు గంజాయి తరలిస్తేన్నారనే సమాచారంతో ఎస్సై ఆధ్వర్వంలో ఎన్టీపీసీ ప్రాజెక్టు లేబర్‌ గేట్‌ రాజీవ్‌ రహదారిపై తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో అనుమానస్పదంగా వస్తున్న కారును ఆపి తనిఖీ చేయగాఅం గంజాయి ప్యాకెట్లు లభించాయి. ఒడిశాలోని చిత్రగొండలో కొనుగోలు చేసి హైదరాబాద్‌లో విక్రయించేందుకు తీసుకెళ్తున్నారని విచారణలో తేలింది. ఈమేరకు మల్కాన్‌గిరి జిల్లాకు చెందిన రాజేశ్‌కుమార్‌ నాయక్‌, ఎస్‌.బషీర్‌, చైతన్య మాడి, గౌతమ్‌ రాయ్‌, సిద్ధార్థ రంజన్‌ దాస్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. 12 కేజీల గంజాయితో పాటు కారు, మూడు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. గంజాయి రవాణాదారులను చాకచక్యంతో పట్టుకున్న పోలీసు సిబ్బందికి రివార్డులు అందజేయనున్నారు.

12 కేజీల గంజాయి, కారు, మూడు సెల్‌ఫోన్లు స్వాధీనం

పెద్దపల్లి డీసీపీ రాంరెడ్డి

Advertisement
 
Advertisement
Advertisement