కరీంనగర్ అర్బన్: నగరంలోని ఫాస్డ్‌ఫుడ్, బేకరీలలో నాసిరకం ఆహార పదార్థాలు వాడుతున్న ఆహారభద్రత అధికారుల తనిఖీల్లో వెల్లడైంది. నూడిల్స్, మంచూరియా, ఫ్రైడ్‌రైస్ ఏదైనా నాసిరకమేనని, పురుగులు పట్టిన గుడ్లను వాడుతున్నారని స్పష్టమైంది. జిల్లా కేంద్రంలోని బస్టాండ్, తెలంగాణచౌక్, కమాన్ ఏరియాల్లో బుధవారం నిర్వహించిన తనిఖీల్లో ఈ విషయం వెల్లడైంది. పలు దుకాణాలు చెల్లుబాటయ్యే ఫుడ్‌లైసెన్స్ లేకపోవడంతో నోటీసులు జారీచేశారు. నాణ్యత లేని టీ పొడి, నూనెలు వాడుతున్నట్లు తేలింది. ఎస్‌ఎఫ్‌ఎస్ బేకరీలో గడువు ముగిసిన బిస్కెట్ ప్యాకెట్లు, జ్యూస్ తయారీలో ఉపయోగిస్తున్న దెబ్బతిన్న ద్రాక్షపండ్లను గుర్తించి పారబోశారు. బస్‌స్టాండ్ కాంప్లెక్స్‌లోని కింగ్స్ ఫాస్ట్‌ఫుడ్ సెంటర్‌లో ఎగ్ ఫ్రైడ్ రైస్ తయారీలో కుళ్లిపోయిన, దెబ్బతిన్న గుడ్లను ఉపయోగిస్తున్నట్లు గుర్తించి సెంటర్‌ను మూసివేశారు.


