ఐఎన్‌ఐ–ఎస్‌ఎస్‌లో ఆల్ ఇండియా 6వ ర్యాంకు
కరీంనగర్: కరీంనగర్‌కు చెందిన మూట సత్యనారాయణ కూతురు డాక్టర్ సౌమ్య విశేష ప్రతిభ కనబరిచి ఐఎన్‌ఐ– ఎస్‌ఎస్ లో ఆల్ ఇండియా 6వ ర్యాంక్ సాధించి ఢిల్లీ ఏఐఐఎంఎస్‌లో కార్డియాలజీకి ఎంపికై ంది. ఇప్పటికే సౌమ్య ఏఐఐఎంఎస్‌లోనే జనరల్ మెడిసిన్ పూర్తి చేసింది. చదువు పూర్తయిన రెండు నెలల వ్యవధిలోనే ఐఎన్‌ఐ– ఎస్‌ఎస్ పరీక్షలో ఆల్ ఇండియా 6వ ర్యాంక్ సాధించి డీఎం కార్డియాలజీ కోర్సుకు ఎంపిక కావడంపై పలువురు అభినందించారు. ఈ సందర్భంగా సౌమ్యను శనివారం ఆమె స్వగృహంలో గంగపుత్ర సంఘం జిల్లా జనరల్ సెక్రటరీ గడప కోటేష్ కుమార్ ఆధ్వర్యంలో పెద్దపల్లి సురేష్, అనుమాస నితిన్‌కుమార్ సన్మానించారు.
ఏఐఐఎంఎస్‌లో కార్డియాలజీకి ఎంపికై న కరీంనగర్ డాక్టర్


