మేకలను కాపాడబోయి..
● కాలువలో పడి యువకుడి మృతి
పెద్దపల్లిరూరల్: మేతకు వెళ్లిన మేకలు ప్రమాదవశాత్తు శ్రీరాంసాగర్ డీ–83 ప్రధాన కాలువలో పడిపోగా.. వాటిని కాపాడబోయిన పెద్దపల్లి పట్టణ శివారు చందపల్లిలోని డబుల్‌బెడ్‌రూం ప్రాంతానికి చెందిన సయ్యద్ సహద్ (19) ప్రమాదవశాత్తు జారికాలువలో పడ్డాడు. ఈతరాకపోవడంతో సహద్ కాలువలో కొంతదూరం కొట్టుకుపోయి మృతిచెందాడని ఎస్సై లక్ష్మణ్‌రావు తెలిపారు. శనివారం ఈ సంఘటన జరిగింది. మృతదేహాన్ని సమీపంలోని జలవిద్యుత్ కేంద్రం సమీపంలో గుర్తించారు. మృతుడి తండ్రి ఖాదర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
చికిత్స పొందుతూ వ్యక్తి ..
జగిత్యాలరూరల్: జగిత్యాలరూరల్ మండలం తాటిపల్లికి చెందిన కంచి లింగం (51) ఈనెల 15న పురుగుల మందుతాగగా.. చికిత్స పొందుతూ శుక్రవారం అర్ధరాత్రి మృతిచెందాడు. లింగం కొద్దిరోజులుగా మద్యానికి బానిసయ్యాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగాడు. కుటుంబ సభ్యులు జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. మెరుగైన వైద్యం కోసం కరీంనగర్‌కు తరలిస్తుండగా మార్గంమధ్యలో మృతిచెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ ఎస్సై ఉమాసాగర్ తెలిపారు.


