ఇద్దరు యువకుల దుర్మరణం
జగిత్యాలక్రైం: జగిత్యాలరూరల్ మండలం హనుమాజీపేట గ్రామ సమీపంలో కారు అదుపు తప్పి విద్యుత్ స్తంభం, కల్వర్టును ఢీకొని బోల్తాపడిన ఘటనలో ఇద్దరు యువకులు మృతిచెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. జగిత్యాల అర్బన్ మండలం ధరూర్ గ్రామానికి చెందిన నవనీత్, జగిత్యాల అర్బన్ మండలం పెర్కపల్లికి చెందిన సాయితేజ, జిల్లాకేంద్రానికి చెందిన సృజన్‌కుమార్ కలిసి శనివారం రాత్రి కారులో పొరండ్ల గ్రామానికి వెళ్లారు. తిరిగి జగిత్యాలకు వస్తుండగా హనుమాజీపేట శివారులో రోడ్డు పక్కనున్న విద్యుత్ స్తంభం, కల్వర్టును ఢీకొని బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న నవనీత్(22), సాయితేజ (22), సృజన్‌కుమార్ తీవ్రంగా గాయపడ్డారు. కారు నుజ్జునుజ్జయి అందులోనే ఇరుక్కుపోయారు. స్థానికులు కష్టపడి ముగ్గురిని బయటకు తీసి జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే నవనీత్, సాయితేజ మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. సృజన్‌కుమార్ పరిస్థితి విషమంగా ఉండడంతో ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న రూరల్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, విచారణ చేపట్టారు.
సాయితేజ (ఫైల్)
నవనీత్ (ఫైల్)
మరొకరి పరిస్థితి విషమం
ఇద్దరు యువకుల దుర్మరణం
ఇద్దరు యువకుల దుర్మరణం
ఇద్దరు యువకుల దుర్మరణం
ఇద్దరు యువకుల దుర్మరణం


