గుంపులలో రోడ్డు ప్రమాదం – తారుపల్లిలో విషాదం
కాల్వశ్రీరాంపూర్(పెద్దపల్లి): పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూ ర్ మండలం తారుపల్లి గ్రామానికి చెందిన సల్పాల బా లకృష్ణ ఓదెల మండలం గుంపుల క్రాస్‌రోడ్డు వద్ద శనివారం జరి గిన ప్రమాదంలో మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. పంటకు తెగులు సో కవడంతో క్రిమిసంహారక మందును కొనుగోలు చేసి జమ్మికుంట నుంచి తారుపల్లికి వస్తున్నాడు.. జ మ్మికుంట వైపు ఆవులను తరలిసిస్తున్న మహేంద్ర బొలేరో వ్యాన్ ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. వారు రోదించిన తీరు కంటతడి పెట్టించింది. ఇంటికి వస్తున్నానని ఫోన్‌చేసిన కాసేపటికే కానరాని లోకానికి వెళ్లిపోయావా అంటూ వెక్కివెక్కి ఏడ్చారు. మృతుడి తండ్రి పోచయ్య బాలకృష్ణ చిన్నతనంలోనే మృతి చెందాడు. తల్లి మల్లీశ్వరి(వృద్ధురాలు) అన్నీతానై పెంచి ప్రయోజకుడిని చేసింది. ఆయనకు భార్య విజయ, కూతురు మధుసుధ(14), కుమారుడు అక్షిత(9)ఉన్నారు. మాజీ సర్పంచ్ గాజనవేన సదయ్య, మాజీ ఎంపీటీసీ శంకరాచారి, గ్రామస్తులు ఘటనా స్థలానికి తరలివెళ్లారు.


