ప్లాస్టిక్‌పై ఏకగ్రీవ సమరం
ప్లాస్టిక్, మద్యపానం నిషేధిస్తూ తీర్మానిస్తున్న రాంపల్లి పంచాయతీ పాలకవర్గం
బట్టసంచులు, ఆకులతో తయారుచేసిన విస్తర్లను వ్యాపరులకు అందిస్తున్న సర్పంచ్, ఎస్సై తదితరులు
పెద్దపల్లిరూరల్: ఏకగ్రీవంగా ఎన్నికై న రాంపల్లి గ్రామపంచాయతీ పాలకవర్గం తొలిసమావేశంలోనే ప్లాస్టిక్‌పై సమరశంఖం పూరించింది. మద్యపానంపైనా నిషేధాస్త్రం విధించింది. గీతకార్మికులు తాటివనంలోనే కల్లు విక్రయించాలని ఆదేశాలు జారీచేసింది. ప్లాస్టిక్, మద్యపానం ద్వారా ప్రజలకు జరిగే అనర్థాలను వివరిస్తూ శనివారం జరిగిన సమావేశంలో తీర్మానం చేసింది.
ఏకగ్రీవ పంచాయతీలో...
పెద్దపల్లి మండలం రాంపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్‌గా కనపర్తి సంపత్‌రావు, ఉప సర్పంచ్‌గా విజయలక్ష్మితో పాటు వార్డుసభ్యులు అందరూ ఇటీవలే ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పల్లెప్రజలు ఇచ్చిన గౌరవాన్ని స్వీకరించిన పాలకులు.. గ్రామస్తులు, యువకుల ఆరోగ్య పరిరక్షణకు ఏదైనా చేయాలనే ఆలోచనకు వచ్చారు. ప్రజారోగ్యానికి హాని కలిగించే మద్యం, ప్లాస్టిక్ భూతాలను ఊరు నుంచి తరిమేయాలని తొలి గ్రామసభలోనే తీర్మానించారు. అంతేకాదు.. బెల్ల్‌షాపు నిర్వాహకులు, కిరాణా వ్యాపారులను గ్రామసభకు రప్పించారు. గ్రామంలో మద్యం, ప్లాస్టిక్ గ్లాస్‌లు, కవర్లు, ప్లేట్లు విక్రయించరాదని వివరించారు. ఇప్పటికే నిల్వలు ఉంటే ఈనెల 25వ తేదీ వరకు పూర్తిగా విక్రయించాలని సూచించారు. రిపబ్లిక్ డే నుంచి సంపూర్ణ మద్యపాన నిషేధం, ప్లాస్టిక్ రహిత గ్రామంగా రాంపల్లిని తీర్చిదిద్దే బాధ్యత వ్యాపారులు, గ్రామస్తులదేనని సర్పంచ్ సంపత్‌రావు, పాలకమండలి సభ్యులు సూచించారు. కల్లుగీత కార్మికులు సైతం ప్లాస్టిక్ క్యాన్లు, బాటిళ్లను నిషేధించి మట్టి కుండలనే వాడాలని సర్పంచ్ పేర్కొన్నారు. లేదంటే ఈనెల 26 తర్వాత నుంచి జరిమానా విధిస్తూ సంపూర్ణ నిషేధానికి చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సమావేశానికి హాజరైన రూరల్ ఎస్సై బుద్దె మల్లేశ్.. గ్రామసభలో చేసిన తీర్మానాన్ని ప్రశంసించారు. పాలకులను అభినందించారు.
మద్యపానం, పాలితిన్ కవర్లపై నిషేధం
రాంపల్లి పంచాయతీ పాలకవర్గ తీర్మానం
ప్లాస్టిక్‌పై ఏకగ్రీవ సమరం


