వైభవంగా మహాలింగార్చన
వేములవాడ: శ్రీరాజరాజేశ్వరస్వామి దేవస్థానంలో మాసశివరాత్రిని పురస్కరించుకుని శనివారం మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం వైభవంగా నిర్వహించారు. మహా మండపంలో మహాలింగార్చన ఘనంగా జరిగింది. ఆలయ అర్చకులు 365 జ్యోతులను వెలిగించి పూజలు చేశారు.
వాట్సాప్ అడ్మిన్ పేరుతో ఘరానా మోసం
జగిత్యాలరూరల్: వర్షసాయి ట్రస్ట్ పేరుతో వాట్సాప్ గ్రూపు క్రియేట్ చేసి రూ.వెయ్యి చెల్లిస్తే రూ.10,500 వెంటనే చెల్లిస్తామంటూ వారం రోజులుగా మోసానికి పాల్పడుతున్నారు. వాట్సాప్ గ్రూపుల్లో ఓ నంబర్ యాడ్ చేస్తే కూడా డబ్బులు చెల్లిస్తామని, ఐదు నిమిషాల్లోనే తిరిగి డబ్బులు చెల్లిస్తామని మోసం చేస్తున్నారు. 600 మంది ఉన్న ఐదైనా వాట్సాప్ గ్రూపులో అడ్మిన్ ఇప్పిస్తే రూ.6 వేలు చెల్లిస్తామంటూ ఆఫర్లు ప్రకటిస్తున్నారు. గ్రూపులో జాయిన్ కాగానే అడ్మిన్ ఇచ్చిన వ్యక్తిని రిమూవ్ చేస్తున్నారు.
పందుల పాకలో దొంగలు పడ్డారు
● 11 పందుల చోరీ
● కేసు నమోదు చేసిన రూరల్‌పోలీసులు
పెద్దపల్లిరూరల్: పెద్దపల్లి మండలం రాఘవాపూర్ గ్రామంలోని లోకిని ఆంజనేయులుకు చెందిన పందుల పాకలో దొంగలు పడ్డారు. 11 పందులను అపహరించుకెళ్లారు. అందులో ఆరింటిని సమీప గౌరెడ్డిపేట శివారులో గుర్తించిన ఆంజనేయులు.. తన ఐదు పందులను దొంగలు ఎత్తుకెళ్లారని శనివారం పెద్దపల్లి రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈనెల 22న జరిగిన ఘటనకు సంబంధించి ఆంజనేయులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు రూరల్ ఎస్సై మల్లేశ్ తెలిపారు. అపహరణకు గురైన పందుల విలువ రూ.7,500 వరకు ఉంటుందని పేర్కొన్నారు.
వైభవంగా మహాలింగార్చన


