నేటి నుంచి సీఎం కప్‌ | - | Sakshi
Sakshi News home page

నేటి నుంచి సీఎం కప్‌

Jan 17 2026 7:36 AM | Updated on Jan 17 2026 7:36 AM

నేటి

నేటి నుంచి సీఎం కప్‌

క్రీడా హంగామాకు పకడ్బందీ ఏర్పాట్లు పంచాయతీస్థాయి నుంచి రాష్ట్రస్థాయి పోటీల వరకు కమిటీలు ఆయా కమిటీల ఆధ్వర్యంలో జరగనున్న పోటీలు

కరీంనగర్‌స్పోర్ట్స్‌: రాష్ట్రంలో క్రీడాస్ఫూర్తిని పతాకస్థాయిలో నిలిపేలా, క్రీడా వాతావరణాన్ని సృష్టించడానికి శనివారం నుంచి చీఫ్‌ మినిస్టర్‌ కప్‌ పోటీలు ప్రారంభం కానున్నాయి. ఈ మహా క్రీడాయజ్ఞాన్ని విజయవంతం చేసేందుకు ప్రభుత్వం, క్రీడాశాఖ బహుముఖ వ్యూహాన్ని అమలు చేసింది. పోటీల నిర్వహణలో పారదర్శకత, పకడ్బందీతనం ఉండేలా గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు వివిధ కమిటీలను ఏర్పాటు చేసింది. పోటీలు కేవలం మొక్కుబడి తంతు కాకుండా.. నిజమైన క్రీడానైపుణ్యాన్ని వెలికితీసేలా, క్రీడాకారుల మధ్య ఆరోగ్యకరమైన పోటీతత్వాన్ని పెంచేలా పకడ్బందీగా కమిటీలను సిద్ధం చేసింది. ఈ కమిటీల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, ఉన్నతాధికారులు, పోలీస్‌ అధికారులు, క్రీడాశాఖాధికారులు, ఒలింపిక్‌ సంఘం ప్రతినిధులు భాగస్వాములను చేశారు. గ్రామ పంచాయతీ నుంచి మొదలుకొని రాష్ట్రస్థాయి వరకు ప్రతి అంచెలోనూ కమిటీలను ఏర్పాటు చేయడం ద్వారా పోటీల నిర్వహణలో ఎక్కడా రాజీ పడకుండా పర్యవేక్షణ ఉండేలా సన్నహాలు చేశారు.

పంచాయతీస్థాయిలో..

పంచాయితీస్థాయిలో జరిగే పోటీలకు సర్పంచ్‌ చైర్మన్‌గా వ్యవహరిస్తారు. పంచాయతీ కార్యదర్శి కోచైర్మన్‌గా, పాఠశాల ప్రధానోపాధ్యాయులు మెంబర్‌ కన్వీనర్‌గా, పీఈటీ, పీడీ, సీనియర్‌ ప్లేయర్‌, వీఆర్వో కమిటీలో సభ్యులుగా వ్యవహరిస్తారు. అథ్లెటిక్స్‌, ఫుట్‌బాల్‌, కబడ్డీ, ఖోఖో, వాలీబాల్‌, యోగా, రిక్రీయేషన్‌ గేమ్స్‌తోపాటు కలెక్టర్‌ ఆదేశాల మేరకు ఒక క్రీడలో పోటీలు జరుగుతాయి.

మండలస్థాయిలో..

మండలస్థాయిలో జరిగే పోటీలకు ఎంపీడీవో చైర్మన్‌గా వ్యవహరిస్తారు. ఎంఈవో లేదా గెజిటెడ్‌ ప్రధానోపాధ్యాయులు మెంబర్‌ కన్వీనర్‌గా, తహసీల్దార్‌, ఎస్‌ఐ, ఎస్జీఎఫ్‌ మండల కార్యదర్శి, సీనియర్‌ ప్లేయర్లు కమిటీలో సభ్యులుగా వ్యవహరిస్తారు. అథ్లెటిక్స్‌, ఫుట్‌బాల్‌, కబడ్డీ, ఖోఖో, వాలీబాల్‌, యోగా, చెస్‌, కరాటే, రిక్రీయేషన్‌ గేమ్స్‌తోపాటు కలెక్టర్‌ ఆదేశాల మేరకు అదనంగా ఒక క్రీడలో పోటీలను నిర్వహిస్తారు.

మున్సిపాలిటీ, కార్పొరేషన్‌ స్థాయిలో..

మున్సిపాలిటీ, కార్పోరేషన్‌ స్థాయిలో జరిగే పోటీలకు మున్సిపల్‌ చైర్మన్‌, మేయర్‌ చైర్మన్‌గా వ్యవహరిస్తారు. మున్సిపల్‌ కమిషనర్‌ మెంబర్‌ కన్వీనర్‌గా, తహసీల్దార్‌, ఎంఈవో లేదా గెజిటెడ్‌ ప్రధానోపాధ్యాయులు, ఇన్స్‌పెక్టర్‌, ఎస్జీఎఫ్‌ మండల కార్యదర్శి, సీనియర్‌ ప్లేయర్లు కమిటీలో సభ్యులుగా వ్యవహరిస్తారు. అథ్లెటిక్స్‌, ఫుట్‌బాల్‌, కబడ్డీ, ఖోఖో, వాలీబాల్‌, యోగా, చెస్‌, కరాటే, రిక్రీయేషన్‌ గేమ్స్‌తోపాటు కలెక్టర్‌ ఆదేశాల మేరకు అదనంగా ఒక క్రీడలో పోటీలను నిర్వహిస్తారు.

అసెంబ్లీ నియోజకవర్గ స్థాయిలో..

అసెంబ్లీ నియోజకవర్గ స్థాయిలో జరిగే పోటీలకు ఎమ్మెల్యే చైర్మన్‌గా వ్యవహరిస్తారు. రిటర్నింగ్‌ అధికారి లేదా కలెక్టర్‌ ద్వారా నియామకమైన అధికారి కోచైర్మన్‌గా, డీవైఎస్‌వో వైస్‌ చైర్మన్‌గా, ఎంఈవో కన్వీనర్‌గా, తహసీల్దార్‌, ఒలింపిక్‌ సంఘం బాధ్యులు, ఎస్జీఎఫ్‌ మండల కార్యదర్శి, ఇన్స్‌పెక్టర్‌, క్రీడా విశ్లేషకులు కమిటీలో సభ్యులుగా వ్యవహరిస్తారు. అథ్లెటిక్స్‌, ఫుట్‌బాల్‌, కబడ్డీ, ఖోఖో, వాలీబాల్‌, యోగా, క్యారమ్‌, చెస్‌, కరాటే, బ్యాడ్మింటన్‌, బేస్‌బాల్‌, బాస్కెట్‌బాల్‌, బాక్సింగ్‌, సైక్లింగ్‌, హ్యాండ్‌బాల్‌, జూడో, కిక్‌ బాక్సింగ్‌, నెట్‌బాల్‌, స్విమ్మింగ్‌, రెజ్లింగ్‌, వుషు, రిక్రీయేషన్‌ గేమ్స్‌తోపాటు కలెక్టర్‌ ఆదేశాల మేరకు అదనంగా ఒక క్రీడలో పోటీలను నిర్వహిస్తారు.

జిల్లాస్థాయిలో..

జిల్లాస్థాయిలో జరిగే పోటీలకు ఇన్‌చార్జి మంత్రి చైర్మన్‌గా, కలెక్టర్‌ కోచైర్మన్‌గా వ్యవహరిస్తారు. ఐపీఎస్‌ అధికారి వైస్‌ చైర్మన్‌గా, అదనపు కలెక్టర్‌ సభ్యులుగా, డీవైఎస్‌వో మెంబర్‌ కన్వీనర్‌గా, ఒలింపిక్‌ సంఘం అధ్యక్ష కార్యదర్శులు, డీఈవో, మున్సిపల్‌ కమిషనర్‌, జిల్లా క్రీడాసంఘాలు, ఎస్జీఎఫ్‌ కార్యదర్శి, క్రీడా విశ్లేషకులు కమిటీ సభ్యులుగా వ్యవహరిస్తారు. అథ్లెటిక్స్‌, ఫుట్‌బాల్‌, కబడ్డీ, ఖోఖో, వాలీబాల్‌, యోగా, క్యారమ్‌, చెస్‌, కరాటే, బ్యాడ్మింటన్‌, బేస్‌బాల్‌, బాస్కెట్‌బాల్‌, బాక్సింగ్‌, సైక్లింగ్‌, హ్యాండ్‌బాల్‌, జూడో, కిక్‌ బాక్సింగ్‌, నెట్‌బాల్‌, స్విమ్మింగ్‌, రెజ్లింగ్‌, వుషు, బాల్‌ బ్యాడ్మింటన్‌, జిమ్నాస్టిక్స్‌, హాకీ, పవర్‌ లిఫ్టింగ్‌, స్కేటింగ్‌, సాఫ్ట్‌బాల్‌, తైక్వాండో, పారా గేమ్స్‌, రిక్రీయేషన్‌ గేమ్స్‌తోపాటు కలెక్టర్‌ ఆదేశాల మేరకు అదనంగా ఒక క్రీడలో పోటీలు నిర్వహిస్తారు.

టెక్నికల్‌, సెలక్షన్‌ కమిటీ చైర్మన్‌గా..

జిల్లాస్థాయిలో నిర్వహించనున్న పోటీలకు టెక్నికల్‌, సెలక్షన్‌ కమిటీ చైర్మన్‌గా కలెక్టర్‌ వ్యవహరిస్తారు. డీవైఎస్‌వో కన్వీనర్‌గా, డీఈవో, ఒలింపిక్‌ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు, కోచ్‌, పీడీ, ఆయా క్రీడా సంఘాల బాధ్యులు సభ్యులుగా వ్యవహరిస్తారు.

నేటి నుంచి సీఎం కప్‌1
1/1

నేటి నుంచి సీఎం కప్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement