లక్షలు వెచ్చించినా దక్కని ప్రాణం
● అంతుచిక్కని వ్యాధితో చిన్నారి మృతి ● వైద్యానికి రూ.70 లక్షలు ఖర్చు
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): ఓ చిన్నారి అంతుచిక్కని వ్యాధికి గురి కాగా.. లక్షలు వెచ్చించి తల్లిదండ్రులు తమ కూతురు ప్రాణాలు కాపాడేందుకు చేసిన ప్రయత్నం ఫలించలేదు. రాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం పదిరకు చెందిన పీచర చందన– రాజేశ్వరరావు దంపతుల కుమార్తె పీచర ధనలక్ష్మి(6) గురువారం చికిత్స పొందుతూ మృతి చెందింది. ఆరు నెలల క్రితం తీవ్ర అనారోగ్యానికి గురికావడంతో హైదరాబాదులోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో చికిత్స అందించారు. సుమారు రూ.70 లక్షలు ఖర్చు చేశారు. వ్యాధి నయం కాకపోవడంతో 20 రోజుల క్రితం ఇంటికి తీసుకొచ్చారు. పరిస్థితి విషమించి గురువారం రాత్రి మృతిచెందింది. మాజీ జెడ్పీటీసీ చీటీ లక్ష్మణ్‌రావు, చీటీ రామారావు సోదరులు కుటుంబ సభ్యులను పరామర్శించారు.
అప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్య
గన్నేరువరం: కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం జంగపల్లి గ్రామానికి చెందిన సంఘం కుమారస్వామి (50) ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై నరేందర్‌రెడ్డి కథనం ప్రకారం.. కుమారస్వామి చికెన్ సెంటర్ నడుపుకుంటూ జీవిస్తున్నాడు. కుటుంబ అవసరాల కోసం కొంతమంది వద్ద అప్పు తీసుకున్నాడు. అప్పులు అధికం కావడం, వాటిని తీర్చేదారిలేకపోవడంతో మనస్తాపం చెందాడు. ఇంట్లో ఎవరూలేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. భార్య వనిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నారు.
ఘనంగా కాట్రేవుల పండుగ
లక్షలు వెచ్చించినా దక్కని ప్రాణం


