కాలం మారినా.. చీరలో అందం మారలే
● చీరెలోని గొప్పతనం తెలుసుకో..! ● ఆకట్టుకున్న నీలోజిపల్లి మహిళ ముగ్గు ● సంక్రాంతి వేళ సోషల్ మీడియాలో వైరల్
బోయినపల్లి(చొప్పదండి): ‘కాలం మారుతున్నా.. చీరెలోని అందం మారదు’ అంటూ రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం నీలోజిపల్లి గ్రామానికి చెందిన మహిళ వేసిన సంక్రాంతి ముగ్గు సోషల్ మీడియాలో వైరల్‌గా మారిది. గ్రామానికి చెందిన కదిరె విజయ ముగ్గులో చీరెను వేశారు. ‘చీరె అంటే కేవలం వస్థ్రం కాదు.. ఆత్మవిశ్వాసం.. అమ్మతనం.. అమ్మాయి తనం.. ఆడవారి గౌరవానికి అందం.. ఆడవారి గౌరవానికి చీరే అసలైన గుర్తు..’ అంటూ ముగ్గులో పెట్టిన కొటేషన్ సంక్రాంతి వేళ సోషల్ లమీడియాలో వైరల్‌గా మారింది.


