సకల మర్యాదల సంక్రాంతి
● కోడిపందేలు.. పేకాట శిబిరాలు.. ● ఉర్రూతలూగించే సాంస్కృతిక కార్యక్రమాలు ● నిమిషాల్లో కోట్లు మాయం ● కోనసీమ జిల్లాలో తెలంగాణ వాసులు
సిరిసిల్ల: సినిమా సెట్టింగులు.. కళ్లు చెదిరే డెకరేషన్.. స్టేడియాన్ని తలపించే సీట్ల అరేంజ్‌మెంట్.. వీవీఐపీ పాసులు.. అడుగడునా వీడియో చిత్రీకరణ.. ఎర్ర నెమలి.. నల్ల నెమలి.. రాజు గారి పుంజు.. రెడ్డిగారి జూలు.. నాయుడిగారి పర్రె.. ఇవీ కోళ్ల పేర్లు.. కోళ్లతో కొట్లాట పెట్టి.. నిమిషాల్లో కోట్లు మాయం చేస్తారు. ఇదంతా ఆంధ్రప్రదేశ్‌లోని సంక్రాంతి సంబరాల్లో కనిపించే దృశ్యాలు. ఈ వేడుకలను రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రతిష్టాత్మకంగా కొబ్బరితోటల్లో.. మైదానాల్లో.. భారీ సినిమా సెట్టింగులను తలపించే రీతిలో నిర్వహిస్తున్నారు.


