టేకు కలప పట్టివేత
● పరారైన దుండగులు
కొడిమ్యాల: కొడిమ్యాల ఫారెస్ట్ రేంజ్ పరిధిలోని దమ్మయ్యపేట, నూకలమర్రి, ఫాజుల్‌నగర్ గ్రామాల్లో అధికారులు దాడులు చేసి నాలుగు ఎడ్లబండ్లలో తరలించేందుకు సిద్ధంగా ఉన్న కలపను పట్టుకున్నారు. అటవీశాఖ అధికారుల రాకను గమనించిన దుండగులు 75 టేకు దుంగలను వదిలిపెట్టి ఎడ్లతో సహా పరారయ్యారు. పట్టుబడిన కలప విలువ రూ.80 వేలు ఉంటుందని కొడిమ్యాల ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ గులాం మొయినోద్దీన్ తెలిపారు. కలప స్వాధీనం చేసుకుని, నిందితుల కోసం గాలిస్తున్నామని తెలిపారు.


