సకినాలు.. గారెలు.. అరిసెలు | - | Sakshi
Sakshi News home page

సకినాలు.. గారెలు.. అరిసెలు

Jan 14 2026 10:07 AM | Updated on Jan 14 2026 10:07 AM

సకినా

సకినాలు.. గారెలు.. అరిసెలు

ఊరూరా సందడి విదేశాలకు గూడూరు అప్పాలు సరదాగా ప్రారంభించి.. బామ్మ చేతివంట.. ఆహా..! వంటింటి రుచులు

ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోని అన్ని గ్రామాల్లో సంక్రాంతి పిండి వంటలు ఇప్పటికే పూర్తి చేశారు. సకినాలు, చెక్కలు(గారెలు), మురుకులు, అరిసెలు, పూసతో తయారుచేసిన లడ్డూలు తయారు చేశారు. సంక్రాంతి సందర్బంగా అల్లుల్లు, ఆడపడుచులతో లోగిల్లన్నీ కళకళలాడుతున్నాయి. గతంలో ఆర్థికంగా బలోపేతమైన కుటుంబాలు మాత్రమే సంక్రాంతి పిండి వంటలు తయారుచేసుకునేవారు. ప్రస్తుతం ప్రతి ఒక్క ఇంట్లో పిండివంటలు తయారు చేస్తున్నారు.

దానం చేసేవాళ్లం

50ఏళ్ల క్రితం సంక్రాంతి వచ్చిందంటే బియ్యం రోటిలో నానబెట్టిన రోకలితో దంచి సకినాలు చేసేటోళ్లం. నేను ఇప్పుడు దాదాపు 85ఏళ్ల నుంచి 90 ఏళ్ల వరకు ఉంటా. చాలా మంది నిరుపేదలు ఆనాటి రోజుల్లో చేసుకునేవారు కాదు. ఆర్థిక ఇబ్బందులు ఉంటేవి. గ్రామంలో పదుల సంఖ్యలో కుటుంబాలు మాత్రమే పిండివంటలు చేసేవారు. చాలా మందికి దాణం చేసేదాన్ని. ఇప్పుడు అందరూ పిండివంటలు చేసుకుంటున్నారు.

– రామక రాధమ్మ,

బొమ్మనపల్లి, చిగురుమామిడి

సంక్రాంతికి పిండి వంటలు తయారు చేయడం ఒక కళ. రుచిగా, ఘుమఘుమలాడుతూ... చూడగానే నోరూరే పిండి వంటలు తయారు చేయడం కొందరికే సాధ్యమవుతుంది. పండగకు పిండి వంటలను తయారు చేసుకోలేని ఉండరు. ఇప్పటికే ఇంటింటా పిండివంటలు తయారు చేయడం పూర్తికాగా.. రిస్క్‌ లేకుండా పిండి వంటలను ఇంటికే తెప్పించుకోవాలనుకునేవారికి మాత్రం... స్వగృహ తయారీ కేంద్రాలు స్వాగతం పలుకుతున్నాయి. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని, ఎన్టీపీసీ, కరీంనగర్‌, సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్‌కు చెందిన పలువురి పిండివంటల టేస్ట్‌ అదుర్స్‌.

– కోల్‌సిటీ/ముస్తాబాద్‌/కరీంనగర్‌రూరల్‌/చిగురుమామిడి

ఫంక్షన్‌ ఏదైనా గూడూరు పిండి వంటకాలు ఉండాల్సిందే. పిండి వంటకాలకు ప్రత్యేకత చాటుతూ రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్‌ మండలం గూడూరు మహిళలు ఉపాధి పొందుతున్నారు. సంక్రాంతి పండగకు చేసే ప్రత్యేక పిండి వంటకాలు గూడూరులో ఏడాది పొడవున లభిస్తాయి. 40 మంది మహిళలు పిండివంటకాల తయారీతో ఉపాధి పొందుతున్నారు. సకినాలు, గారెలు, లడ్డులు, పూస, చేకోడిలు, కజ్జికాయలు, మురుకు, బూందీ తయారు చేస్తూ.. కిలో రూ.350కి విక్రయిస్తున్నారు. హైదరాబాద్‌, ముంబయితోపాటు గల్ఫ్‌, అమెరికా, బ్రిటన్‌, ఆస్ట్రేలియా దేశాలకు పంపిస్తారు.

అన్ని రకాల ఫంక్షన్లకు ఆర్డర్లు

సంక్రాంతితోపాటు ఇతర పండగలకు పిండి వంటకాలకు ప్ర త్యేకంగా ఆర్డర్లు వస్తున్నాయి. స కినాలు, గారెలు, లడ్డ్డూలు, ము రుకు వంటకాలను ప్రత్యేకంగా తీసుకెళ్తున్నారు. సిరిసిల్ల ప్రాంతంలో జరిగే ఫంక్షన్లకు ఆర్డర్లు వస్తున్నాయి. విదేశాలకు ప్రత్యేకంగా ప్యాకింగ్‌ చేసి పంపుతున్నాం.

– కారంగుల రజనీ, గూడూరు

సకినాలు

కరీంనగర్‌ పరిధిలోని తీగలగుట్టపల్లికి చెందిన సాయిని అనిత హాబీగా చేసిన పిండివంటల తయారీని ప్రస్తుతం స్వయం ఉపాధిగా మారింది. మూడేళ్లక్రితం సరదాగా వివిధ రకాల పిండివంటలను తయారు చేయడం నేర్చుకున్నారు. స్థానికులతోపాటు బంధువులకు గారెలు, సకినాలు, అరిసెలు, లడ్డులను విక్రయించగా రుచికరంగా ఉండటంతో క్రమేపీ గిరాకీ పెరిగింది. సోదరి అనూషతో కలిసి పిండివంటలను తయారీ చేసి విక్రయించడం ద్వారా ఉపాధిపొందుతున్నారు. హైదరాబాద్‌, మహారాష్ట్ర, గోదావరిఖని, కరీంనగర్‌ తదితర ప్రాంతాలకు సరఫరా చేస్తున్నారు.

సైదాపూర్‌: సంక్రాంతి అంటేనే రంగవల్లులు, గొబ్బెమ్మలు, పతంగులు, పిండి వంటలు. సంక్రాంతికి చేసే పిండి వంటలు చాలా ప్రత్యేకం. వానా కాలం పంటలు చే తికి వచ్చిన తర్వాత జరుపుకునే పండుగ సందర్భంగా చేసే పిండి వంటలు ఆరోగ్యానికి ఎంతో మంచింది. ఉరుకులు పరుగుల జీవితంతో చాలా మంది రెడీమేడ్‌ పిండి వంటలు ఆర్డర్‌ చేస్తున్నారు. అయితే గ్రామాల్లో ఇప్పటికీ అనుభవం ఉన్నవారితో చేయించే వంటల కమ్మదనమే వేరు. సైదాపూర్‌ మండలానికి చెందిన పేరుకపల్లి గ్రామానికి చెందిన శతాధిక వృద్ధురాలు మేడిశెష్టి వీరవ్వ సంక్రాంతి పండుగ సందర్భంగా తన ప్రత్యేక పిండి వంటలు తయారు చేసి ఆకట్టుకున్నారు. ఈ మహిళా అసాధారణమైన ఉత్సాహంతో వివిధ రకాల పిండి వంటకాలు చేసి, పంచుకోవడం ద్వారా పండుగ ఉత్సవాలను మరింత రంగుల్లా మార్చారు.

కోల్‌సిటీ(రామగుండం): గోదావరిఖని పవర్‌హౌజ్‌కాలనీలోని శ్రీసాయి తెలంగాణ పిండివంటల కేంద్రం టెస్టే సపరేటు అంటున్నారు స్థానికులు. తానిపర్తి రామ్మోహన్‌రావు ఆయన భార్య జయశ్రీ కలిసి 23ఏళ్లుగా ఇంట్లోనే పండివంటల కేంద్రాన్ని నిర్వహిస్తున్నారు. 20మందికి ఉపాధి కల్పిస్తున్నారు. ప్రతీరోజూ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సకినాలు, గారెలు, అరిసెలు, చగోడిలు, నువ్వుల ముద్దలు, లడ్డులు, కారపూసలు(జంతికలు), కరిజలు, పల్లీలడ్డులు, భక్షాలు, సర్వపిండి తయారు చేస్తున్నారు. ఇక్కడ తయారు చేసిన పిండి వంటలను ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోని స్వీట్‌హౌజ్‌లు, బేకరీలు, సూపర్‌మార్కెట్‌లు, కిరాణం దుకాణాలతోపాటు హైదరాబాద్‌, ఆదిలాబాద్‌, మంచిర్యాల తదితర జిల్లాలకు సరఫరా చేస్తున్నారు. అమెరికా, ఆస్ట్రేలియా, దుబాయ్‌, యుకే తదితర ఎన్‌ఆర్‌ఐ ప్యాకింగ్‌లో పంపిస్తున్నట్లు రామ్మోహన్‌రావు తెలిపారు.

సంక్రాంతికి గిరాకీ

2003లో రెండు రూపాయలకే పప్పు, జొన్న రొట్టె తయారు చేసి అమ్మడం ప్రారంభించాం. తరువాత సకినాలు, గారెలు తయారు చేసి విక్రయించాం. ఆర్డర్‌ ఇచ్చి మరీ తయారు చేసుకుపోతుండడంతో, ప్రతీ రోజూ తయారు చేయడం మొదలెట్టాం. ఇప్పుడు మాతోపాటు మరో 20 మంది మహిళలకు ఉపాది కల్పిస్తున్నాం. సంక్రాంతికి ఎక్కువగా 15 రోజుల ముందు నుంచే ఆర్డర్స్‌ వస్తున్నాయి. మేం తయారు చేసిన పిండి వంటలను విదేశాలకు పంపిస్తున్నాం.

– తానిపర్తి రామ్మోహన్‌రావు, జయశ్రీ,

దంపతులు, గోదావరిఖని

సకినాలు.. గారెలు.. అరిసెలు1
1/8

సకినాలు.. గారెలు.. అరిసెలు

సకినాలు.. గారెలు.. అరిసెలు2
2/8

సకినాలు.. గారెలు.. అరిసెలు

సకినాలు.. గారెలు.. అరిసెలు3
3/8

సకినాలు.. గారెలు.. అరిసెలు

సకినాలు.. గారెలు.. అరిసెలు4
4/8

సకినాలు.. గారెలు.. అరిసెలు

సకినాలు.. గారెలు.. అరిసెలు5
5/8

సకినాలు.. గారెలు.. అరిసెలు

సకినాలు.. గారెలు.. అరిసెలు6
6/8

సకినాలు.. గారెలు.. అరిసెలు

సకినాలు.. గారెలు.. అరిసెలు7
7/8

సకినాలు.. గారెలు.. అరిసెలు

సకినాలు.. గారెలు.. అరిసెలు8
8/8

సకినాలు.. గారెలు.. అరిసెలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement