రైల్వేగేట్‌ను ఢీకొట్టిన ట్రాలీ
ఓదెల(పెద్దపల్లి): కాజీపేట – బల్హార్షా మధ్య కొలనూర్ లెవల్ క్రాసింగ్‌గేట్‌ను గుర్తుతెలియని ట్రాలీ ఢీకొట్టింది. దీంతో ప్రయాణికుల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ప్రత్యక్షసాక్షుల కథనం ప్రకారం.. మంగళవారం రెండు రైళ్లు వెళ్లాక గేట్‌మెన్ గేట్ తీశారు. ఈక్రమంలో వాహనాలు గేట్ దాటుతుండగా.. గేట్‌మెన్ మళ్లీ గేట్ వేసేందుకు యత్నిస్తున్నాడు. ఈసమయంలో సుల్తానాబాద్ నుంచి కాల్వశ్రీరాంపూర్ వైపుకు వెళ్లె ట్రాలీ వేగంగా గేట్‌లోపలికి దూసుకువెళ్లి చివరి గేట్‌ను ఢీకొట్టింది. దీనితో రెండోగేట్ విరిగింది. ప్రత్యామ్నాయంగా గేట్‌మెన్ మరోగేట్ వేశారు. సుల్తానాబాద్ నుంచి కాల్వశ్రీరాంపూర్ వైపు వెళ్లె వాహనాలు, ఆర్టీసీ బస్సులు నిలిచిపోయాయి. ఓదెలకు వెళ్లే బస్సు కొలనూర్‌లో ఆగిపోవటంతో ప్రయాణికులు అక్కడే దిగాల్సివచ్చింది. కాలినడనకన ప్రయాణికులు గేట్ దాటి ప్రైవేట్ వాహనాల్లో గమ్యస్థానం చేరారు. గేట్‌మెన్ ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. సిబ్బంది చేరుకుని నాలుగు గంటలపాటు రిపేరు చేసి గేట్‌ను బాగు చేశారు. దీంతో యథావిధిగా రాకపోకలు సాగాయి.
నిలిచిన ఆర్టీసీ బస్సులు
నాలుగు గంటల పాటు మరమ్మతు
ప్రయాణికులకు తప్పని ఇబ్బందులు


