ఆలం అలగలేదు: సీపీ కార్యాలయం
కరీంనగర్ క్రైం: సీపీ గౌస్ ఆలం ఆకస్మిక సెలవు విషయంపై సీపీ కార్యాలయం స్పందించింది. ఎస్సై స స్పెన్షన్ విషయానికి, సీపీ గౌస్ ఆలం సెలవుపై వె ళ్లిన విషయానికి ఏమాత్రం సంబంధం లేదని మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించింది. ముందస్తుగా ఉన్నతాధికారులకు జనవరి 11 నుంచి 18 వరకు సెలవు కోరగా మంజూరు చేసినట్లు వివరించింది. తాజా రాజకీయ పరిణామాలకు సీపీ సెలవుకు సంబంధం లేదని స్పష్టంచేసింది.
కోనరావుపేట(వేములవాడ): కోనరావుపేట మండలం సుద్దాలకు చెందిన సుంకిర నాగభూషణం (65) అనారోగ్యం బాధ భరించలే క మంగళవారం వ్యవసాయక్షేత్రం వద్ద ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై ప్రశాంత్‌రెడ్డి తెలిపారు. మృతుడి కుమారుడు సుంకరి రమేశ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని అన్నారు.
జగిత్యాలక్రైం: జగిత్యాల రూరల్ మండలం పొరండ్ల గ్రామానికి చెందిన వేములవాడ గంగారాం (53) ఈనెల 3న పురుగుల మందుతాగగా.. చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందాడు. గంగరాజం ఇంటి వద్ద పురుగుల మందుతాగాడు. కుటుంబ సభ్యులు జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించినా ఫలితం కనిపించలేదు. గంగరాజం కుమారుడు రాజశేఖర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు రూరల్‌ఎస్సై ఉమాసాగర్ తెలిపారు.
వేములవాడరూరల్: జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం తిప్పాయపల్లికి చెందిన కొలకాని సతీశ్ (27) అనుమానాస్పదంగా మృతి చెందాడు. మృతుడి కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. సతీశ్‌కు ఈనెల 12న తమ గ్రామానికి చెందిన కొందరు ఫోన్ చేయగా ఇంటినుంచి వెళ్లి తిరిగి రాలేదన్నారు. 13న తెల్లవారుజామున వేములవాడ ఆస్పత్రిలో గాయాలతో ఉన్నాడని ఓ వ్యక్తి ఫోన్ చేసి సమాచారం ఇచ్చినట్లు తెలిపారు. ఆస్పత్రికి వెళ్లిచూడగా మృతి చెంది ఉన్నాడని అన్నారు. కాగా తమ కొడుకు మృతదేహంపై గాయాలు ఉన్నాయని, మృతిపై అనుమానాలు ఉన్నాయని వెంటనే విచారణ జరపాలని తండ్రి నర్సయ్య పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
అప్పు చేసి.. ఐపీ పెట్టి
పెగడపల్లి: అధిక వడ్డీ ఇస్తానని చెప్పి పలువురి నుంచి రూ.లక్షలు అప్పుగా తీసుకున్న ఓ వ్యాపారి కోర్టు నుంచి ఐపీ నోటీసులు పంపించాడు. దీంతో అతడికి అప్పు ఇచ్చిన వారు లబోదిబోమంటున్నారు. ఈ ఘటన పెగడపల్లి మండలంలోని ఆరవెల్లిలో వెలుగుచూసింది. గ్రామానికి చెందిన ఓ వ్యక్తి వ్యవసాయం, పాడి పశువుల పెంపకం, కోడిగుడ్ల వ్యాపారం చేశాడు. ఈ క్రమంలో తెలిసిన 61 మంది నుంచి రూ.1.20కోట్ల అప్పు చేసినట్లు సమాచారం. అప్పు చెల్లించాలని వారు ఒత్తిడి చేయడంతో కొద్దిరోజుల క్రితం కుటుంబంతో కలిసి పరారయ్యాడు. తాజాగా కోర్టు నుంచి రూ.1.20 కోట్లకు ఐపీ నోటీసులు పంపించాడు. దీంతో రుణదాతలు లబోదిబోమంటున్నారు. మంగళవారం కొందరు రుణదాతలు పోలీసులను ఆశ్రయించినట్లు తెలిసింది.


