కిక్కిరిసిన కొండగట్టు
మల్యాల: కొండగట్టు అంజన్న ఆలయం మంగళవారం భక్తులతో కిక్కిరిసిపోయింది. సంక్రాంతి సెలవులకుతోడు సమ్మక్క, సారలమ్మ జాతరకు వెళ్లే భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు బారులు తీరారు. ఆలయ అధికారులు భక్తుల క్యూలైన్లను పర్యవేక్షించారు.
బద్దిపోచమ్మకు బోనం
వేములవాడ: రాజన్న, భీమన్నలను దర్శించుకున్న భక్తులు మంగళవారం వేకువజాము నుంచే బద్దిపోచమ్మకు బోనం మొక్కులు చెల్లించుకునేందుకు బారులుతీరారు. అమ్మవారికి కల్లుసాక, ఒడిబియ్యం సమర్పించారు. భక్తుల రద్దీని గమనించిన అధికారులు రాత్రంతా దర్శనాలకు అనుమతించారు. ఆలయ అధికారులు ఏర్పాట్లను పరిశీలించారు. పోలీసులు బందోబస్తు నిర్వహించారు.
కిక్కిరిసిన కొండగట్టు
కిక్కిరిసిన కొండగట్టు
కిక్కిరిసిన కొండగట్టు


