కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేస్తున్న కేంద్ర ప్రభుత్వం:
గోదావరిఖని: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేస్తోందని సీపీఐ జాతీయ మాజీ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి విమర్శించారు. మంగళవారం స్థానిక భాస్కర్‌రావుభవన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ రంగ సంస్థల్లో నిధులను అదానీ, అంబానీలకు కట్టబెడుతున్న కేంద్ర ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. బిహార్ ఎన్నికలు దేశరాజకీయ ముఖచిత్రాన్ని మారుస్తాయని అభిప్రాయపడ్డారు. పేదల కోసం, స్వాతంత్య్ర సాధన కోసం పోరాడిన భారత కమ్యూనిస్టు పార్టీ(సీపీఐ) డిసెంబర్ 26న శతవసంతాల్లోకి వస్తున్న సందర్భంగా ఖమ్మంలో ఐదు లక్షల మందితో బహిరంగసభ ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ సందర్భంగా ఆదిలాబాద్‌లోని జోడేఘాట్‌లో జీపుజాతా ప్రారంభించి రాష్ట్రమంతా నిర్వహిస్తామన్నారు. ఇందులో భాగంగా ఈనెల16న గోదావరిఖని, పెద్దపల్లి, సుల్తానాబాద్ ప్రాంతాల్లో సాగుతుందని తెలిపారు. నాయకులు తాండ్ర సదానందం, గౌతమ్ గోవర్ధన్, గోషిక మోహన్, కడారి సునీల్, తాళ్లపల్లి మల్లయ్య, మడ్డి ఎల్లయ్య, మార్కపురి సూర్య, తాళ్లపల్లి లక్ష్మణ్, వైవీరావు, మాటేటి శంకర్, రామచందర్, జిగురు రవీందర్, ఆరేపల్లి మానస్‌కుమార్, బాలసాని లెనిన్, రేణికుంట్ల ప్రీతం, కల్లెపల్లి నవీన్, చంద్రశేఖర్, రంగు శ్రీనివాస్, తొడుపునూరి రమేశ్‌కుమార్ పాల్గొన్నారు.


