జలుబు.. దగ్గు
● పిల్లలు, వృద్ధులకు న్యుమోనియా ముప్పు
● తక్కువ వ్యాధి నిరోధక శక్తి గల వారిపై వైరస్ దాడి
● జిల్లాలో ఈ ఏడాది కొత్తగా 199 కేసులు నమోదు
సాక్షి,పెద్దపల్లి: జిల్లాలో చలి మొదలైంది. దాంతోపాటే జలుబు, దగ్గు, గొంతునొప్పి, ఫ్లూజ్వరం, ఆయాసం కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ప్రధానంగా న్యుమోనియా, ఆస్తమా, అలర్జీ తదితర శ్వాసకోశవ్యాధుల ముప్పు పొంచి ఉందని, జిల్లావాసులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అప్రమత్తం చేస్తోంది. ప్రధానంగా అప్పుడే పుట్టిన శిశువులను ఈ వ్యాధి వేధిస్తోంది. వ్యాధి నిరోధకశక్తి తక్కువగా ఉన్నవారిపై తీవ్రప్రభావం చూపిస్తోంది. ప్రైవేట్, ప్రభుత్వ ఆస్పత్రులకు సీజనల్ వ్యాధులతో బాధపడేవారి సంఖ్య పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది.
ప్రాణాలు తీస్తుంది..
చలికాలం.. జరభద్రం

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
