మంగళవారం శ్రీ 4 శ్రీ నవంబర్ శ్రీ 2025
న్యూస్‌రీల్
దారిద్య్రం
రహదారులు రక్తసిక్తం
రోడ్డెక్కాలంటే వాహనాలతో భయం
చేవెళ్ల తరహాలో పొంచి ఉన్న ప్రమాదాలు
డేంజర్‌గా ఇసుక, గ్రానైట్ వాహనాలు
ట్రాఫిక్ రూల్స్ పాటించని వాహనదారులు
రోడ్డు ప్రమాదాల్లో కరీంనగర్ జిల్లా టాప్
రోడ్డుపై నెత్తురు చుక్కగా మొదలై.. ధారలై.. ప్రవాహమై పండంటి జీవితాలను నాశనం చేస్తుంది... పచ్చటి బతుకులను బలి తీసుకుంటుంది.
ఎవరిదీ పాపం..! అచేతనంగా ఉన్న
ఆ రోడ్డుదా!!
మనిషి చేతిలోని మర యంత్రానిదా!!
అవసరం అనివార్యమై బతుకుపోరు చేస్తున్న మనుషులదా!! ఎవరేస్తారు అడ్డుకట్ట..?
ఎక్కడుంది ఆనకట్ట..?
అయ్యా.. ప్రజాప్రతినిధులు.. నాయకులు.. అధికారులారా కనిపించడం లేదా శవాలగుట్టలు.. వినిపించడంలేదా ఆర్తనాదాలు.. అడుగడుగునా మోడువారిన బతుకులు. పారాణి ఆరకముందే నేలరాలిన సాభాగ్యాన్ని..లోకాన్ని చూడకముందే చీకట్లు కమ్మిన బాల్యాన్ని..
బతుకుపోరులో రహదారిపై నడుము ఇరిగిన యువతరాన్ని.. ఆసరా కోల్పోయిన
వృద్ధులను చూడండి. విజ్ఞులని పట్టంగట్టాం..
మా జీవిత గమనాన్ని మీ చేతుల్లో పెట్టాం..
తక్షణ కార్యాచరణ లేకపోతే మీరు వల్లించే అభివృద్ధి మాటలకు సూచికగా
మిగిలేది మరుభూమే..!


