● పరీక్షకు ఉత్సాహంగా హాజరైన విద్యార్థులు
సప్తగిరికాలనీ(కరీంనగర్): సాక్షి మీడియా గ్రూప్ ఆధ్వర్యంలో మంగళవారం కరీంనగర్‌లోని వివిధ పాఠశాలల్లో నిర్వహించిన స్పెల్‌బీ, మ్యాథ్స్ ప్రిలిమినరీ మొదటి రౌండ్ పరీక్షకు విశేష స్పందన లభించింది. కరీంనగర్, పెద్దపల్లిలో సుమారు 15 కేంద్రాల్లో పరీక్ష జరిగింది. 1నుంచి 10వ తరగతి చదివే విద్యార్థులు పరీక్షకుఽ అధిక సంఖ్యలో హాజరయ్యారు. కేటగరీ–1లో భాగంగా 1, 2 తరగతి విద్యార్థులకు 2వ కేటగిరీలో 3, 4 తరగతుల విద్యార్థులకు, 3వ కేటగిరీలో 5, 6,7వ తరగతుల విద్యార్థులకు, 4వ కేటగిరిలో 8, 9, 10 విద్యార్థులకు పరీక్ష నిర్వహించారు. పరీక్షకు ప్రజెంటింగ్ స్పాన్సర్ డ్యూక్స్ వాపీ, అసోసియేట్ స్పాన్సర్‌గా ట్రిప్స్ ఇంటర్నేషనల్ స్కూల్ (రాజమండ్రి) వ్యవహరిస్తున్నారు. వివిధ పాఠశాలల చైర్మన్లు, కరస్పాండెంట్లు, ప్రిన్సిపాల్స్, సాక్షి సిబ్బంది పాల్గొన్నారు.
‘సాక్షి’ స్పెల్‌బీ, మ్యాథ్స్‌బీకి విశేష స్పందన


