బుధవారం శ్రీ 5 శ్రీ నవంబర్ శ్రీ 2025
న్యూస్‌రీల్
కాంగ్రెస్ పార్టీలో ‘అర్బన్’ చిచ్చు రాజుకొంటోంది. ఇప్పటికే కరీంనగర్ కేంద్రంగా ఉన్న కాంగ్రెస్ వర్గపోరు, అర్బన్ బ్యాంక్ ఎన్నికల వేదికగా మరోసారి బయటపడింది. కరీంనగర్‌పై పట్టు నిలుపుకొనేందుకు ఒకవర్గం, పట్టు సాధించేందుకు మరోవర్గం వేస్తున్న ఎత్తులు పైఎత్తులతో గ్రూప్ రాజకీయాలు తారాస్థాయికి చేరుకున్నాయి. పార్టీ రహితంగా జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచినట్లా...ఓడినట్లా...తెలియక శ్రేణులు తికమక పడుతుంటే, ఇదే అంశాన్ని తమకు అనుకూలంగా మలుచుకొనేందుకు ఇరు వర్గాలు బంతిని హైకమాండ్ కోర్టుకు పంపిస్తున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల ముందు ఈ గ్రూప్‌ల గోల ఆశావహులకు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది.
కాంగ్రెస్‌లో


