రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు
కరీంనగర్‌క్రైం: రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని సీపీ గౌస్ ఆలం స్పష్టం చేశారు. గత రెండేళ్లతో పోల్చితే రోడ్డు ప్రమాదాల సంఖ్య తగ్గుముఖం పడుతోందని తెలిపారు. నిత్యం ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించి వేగ నియంత్రణ, హెల్మెట్, సీట్‌బెల్ట్ ధరించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. బ్లాక్ స్పాట్లను గుర్తించి ఆర్‌ఆండ్‌బీ అధికారులతో సమన్వయం చేసుకొని సైన్‌బోర్డులు, స్పీడ్ బ్రేకర్లు, తగిన రోడ్డు మార్కింగ్‌లు చేస్తున్నట్లు తెలిపారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి పౌరుడు బాధ్యతగా వ్యవహరించాలని, మద్య ం సేవించి వాహనం నడపకూడదని, సెల్‌ఫోన్ డ్రైవింగ్ ప్రమాదాలకు దారి తీస్తుందన్నారు.
ఆర్‌పీఎఫ్ బ్యారక్ ప్రారంభం
కరీంనగర్‌రూరల్: కరీంనగర్ రైల్వేస్టేషన్‌లో కొత్తగా ఏర్పాటు చేసిన ఆర్‌పీఎఫ్ అవుట్ పోస్ట్, బ్యారక్ వసతి భవనాన్ని దక్షిణ మధ్య రైల్వే డీఆర్‌ఎం గోపాలకృష్ణన్ మంగళవారం ప్రారంభించారు. అనంతరం రైల్వేస్టేషన్‌ను ప రిశీలించారు. దక్షిణ మధ్య రైల్వే సీపీఎం ఎస్‌కే శర్మ, సీనియర్ డీసీఎం షిఫాలీకుమార్, సుమిత్ మిట్టల్, సురేశ్‌రెడ్డి, వసీంపాషా పాల్గొన్నారు.
నిబంధనలు పాటించాలి
కరీంనగర్‌టౌన్: ఐవీఎఫ్ కేంద్రాలు నిబంధనలు పాటించాలని డీఎంహెచ్‌వో వెంకటరమణ ఆదేశించారు. జిల్లాకేంద్రంలోని పలు ఐవీఎఫ్ కేంద్రాలను మంగళవారం ప్రత్యేక బృందాలతో కలిసి తనిఖీ చేశారు. ఇన్విట్రో ఫెర్టిలైజేషన్ కేంద్రాల్లోని ఆల్ట్రాసౌండ్ యంత్రాల పనితీరు, రిజిస్టర్లు, పేషెంట్ అనుమతి పత్రాలు, కేస్ రికార్డులు, డాక్యుమెంట్లు, ఫామ్(ఎఫ్)పత్రాలు పరిశీలించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. తనిఖీలు నిరంతరం కొనసాగుతాయన్నారు. డాక్టర్ ఉమాశ్రీ, డాక్టర్ సనజవేరియా, రమేశ్, సయ్యద్ సాబీర్ పాల్గొన్నారు.
యోగా శిక్షణ ఇవ్వాలి
కరీంనగర్‌స్పోర్ట్స్: ప్రాథమికస్థాయి నుంచి యోగా శిక్షణ ఇచ్చేందుకు రాష్ట్రంలోని ప్రతీ ప్రభుత్వ పాఠశాలలో కోచ్‌లను నియమించాల ని మంగళవారం తెలంగాణ యోగా అసోసియేషన్ చైర్మన్ సర్దార్ రవీందర్ సింగ్ హైదరాబాద్‌లో రాష్ట్ర స్పోర్ట్స్ అడ్వైజర్ ఏపీ జితేందర్‌రెడ్డిని కోరారు. గత నెలలో పీఎంశ్రీ పథకం ద్వారా ఎంపిక చేసిన పాఠశాలలో మాత్రమే యోగా కోచ్‌ల నియామకానికి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. అన్ని పాఠశాలల్లో యోగా కోచ్‌ల నియామకం చేయాలన్నారు. జితేందర్‌రెడ్డి స్పందిస్తూ యోగా ప్రాధాన్యం, ఆవశ్యకతను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానన్నారు. రాష్ట్ర యోగా అసోసియేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎస్‌ఎన్ రెడ్డి, యోగా ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఉపాధ్యక్షుడు జాల మనోహర్‌కుమార్, తెలంగాణ ఇన్‌చార్జి కార్యదర్శి నాగిరెడ్డి సిద్ధారెడ్డి, గుంటి రామకృష్ణ ఉన్నారు.
పత్తి మార్కెట్‌కు సెలవులు
జమ్మికుంట: జమ్మికుంట మార్కెట్‌కు బుధవారం, గురువారం సెలవు ఉంటుంద ఉన్నత శ్రేణి కార్యదర్శి మల్లేశం తెలిపారు. శుక్రవారం యథావిధిగా కొనుగోళ్లు సాగుతాయన్నారు. కాగా.. మంగళవారం క్వింటాల్ పత్తి రూ. 7,200 పలికిందని ఆయన వివరించారు.
రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు
రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు


